Tamilnadu Road Accident: తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాను లోయలో పడిన ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. దాదాపు 30 మంది ప్రయాణికులు పులియార్ గ్రామం నుంచి సెంబరై ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
వ్యాను ఘాట్ రోడ్డు మీదుగా వెళ్తున్న సమయంలో డ్రైవర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోవడంతో వాహనం లోయలో పడిపోయింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన 22 మందికి రూ.55 వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
రెండు రోజుల క్రితం ఇదే తిరుపత్తూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అంబూర్-వేలూర్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మృతులను స్థానిక షూ కంపెనీలో పనిచేసే కార్మికులుగా గుర్తించారు.
Also Read: Srilanka Crisis: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం... దేశవ్యాప్తంగా 36 గంటల కర్ఫ్యూ..
Also Read: Revanth Reddy: తెలంగాణ రైతులకు కేసీఆర్ మరణశాసనం, ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook