Atishi Marlena takes charge as delhi new cm: ఢిల్లీకి కొత్త సీఎంగా ఆతిశీ పేరును పార్టీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ అతీశీ పేరును ప్రకటించగా.. ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్..ప్రజల్లోకి వెళ్లి తన పట్ల నిజాయితీని నిరూపించుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రజలు ఏవిధంగా స్పందిచిన కూడా తనకు ఆమోద యోగ్యమే అన్నారు. అంతేకాకుండా.. ఎలాంటి పరిస్థితుల్లోను, బీజేపీ ముందు తలవంచేది లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. ఢిల్లీలిక్కర్ పాలసీ కేసులో.. అరెస్టైన అర్వింద్ కేజ్రీవాల్ ఇటీవల తీహార్ జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు. ఈ క్రమంలో ఆయన బహిరంగ సమావేశంలో ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తాను.. మరో రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేసిన ప్రజల్లోకి వెళ్తానని ప్రకటించారు. కోర్టులో తన నిజాయితీ నిరూపణ అయ్యిందని, ఇక ప్రజలే.. తాను.. నేరం చేసిన వాడ్ని అంటారా.. లేదా నిర్ధోషిగా ప్రకటిస్తారో వాళ్ల దగ్గరకే వెళ్లి తెల్చుకుంటానన్నారు.
Read more: Arvind Kejriwal: రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా.. సంచలన ప్రకటన చేసిన అరవింద్ కేజ్రీవాల్..
అయితే.. కేజ్రీవాల్ అన్నమాట ప్రకారం.. తన పదవీకి రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి.. సమావేశం ఏర్పాటు చేసి.. అతిశీని ఏకగ్రీవంగా సీఎంగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. అదే విధంగా ఈ నవంబర్ లో ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించేందుకు సైతం డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.