/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

TN govt steps in to help curb tomato price rise: దేశంలో టమాటా ధరలు భగ్గు మంటున్నాయి. ఈ నెల ఆరంభం వరకు పెట్రోల్ ధరలు ప్రజలను బెంబేలెత్తించగా.. ప్రభుత్వం చొరవతో పెట్రో ధరలు కాస్త తగ్గి.. స్థిరంగా కొనసగుతున్నాయి. ఆయితే ఇప్పుడు రోజు రోజుకు ధరలు పెరుగుతూ టమాటాలు (Tomato prices in India) సామాన్యుల జేబుకు చిల్లు పెడుతున్నాయి.

దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కిలో టమాటా ధర రూ.100 పైకి చేరింది. తమిళనాడులో అయితే ఇంకా రికార్డు స్థాయికి (Tomato prices in Tamilnadu) చేరాయి. చెన్నై సహా.. పలు ప్రాంతాల్లో కిలో టమాటా ధర రూ.150 నుంచి రూ.160 వద్ద కొనసాగుతోంది.

దీనితో టమాటా ధరలను అదుపు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం చర్యలు చెపట్టింది.

మహారాష్ట్ర సహా ఉత్తరాది రాష్ట్రాల నుంచి భారీగా టమాటాలను కొనుగోలు చేసుకోవడం ప్రారంభించింది. టమాటాలతో పాటు.. మొత్తం 15 మెట్రిక్ టన్నుల కూరగాయలను ప్రతిరోజు కొనుగోలు (Tamilnadu government has decided to procure tomatoes) చేసుకుంటున్నట్లు వెల్లడించింది.

Also read: ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద విమానాశ్రయానికి మోదీ శంకుస్థాపన

Also read: Cash in drainage pipe: డ్రైనేజీ పైపులో లక్షల కొద్ది అవినీతి సొమ్ము.. ఏసీబీ సోదాల వీడియో వైరల్

కొనుగోలు చేసుకున్న టమోటాలను సహకార శాఖ పరిధిలోని దుకాణాల్లో రూ.85 నుంచి రూ.100 మద్య అమ్ముతున్నట్లు తెలిపింది. బుధవారం ఈ సబ్సిడీ విక్రయాలు ప్రారంభించగా.. మధ్యాహ్నం వరకు 8 మెట్రిక్ టన్నులు అమ్మడైనట్లు తెలిపింది ప్రభుత్వం. ఈ సమయంలో ఓపెన్​ మార్కెట్లో కిలో టమాటా ధర రూ.140 వద్ద ఉండగా.. సహకార దుకాణాల్లో రూ.900-100 మధ్య అమ్మినట్లు పేర్కొంది.

Also read: Man killed by minor daughter : లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డ తండ్రిని హత్య చేసిన కూతురు

టమాటా ధరలు ఈ స్థాయిలో పెరిగేందుకు కారణాలు..

ఈ నెల ఆరంభం నుంచి 18వ తేదీ వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు (Tamilnadu rains) తమిళనాడులో భారీగా పంట నీట మునిగింది. మరోవైపు టమాటా ఉత్పత్తి అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో కూడా వర్షాలు బీభత్సం సృష్టించాయి. కుండపోత వానలకు తీవ్రంగా పంట నష్టం సంభవించింది.

దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో టామాటాకు డిమాండ్ భారీగా పెరిగింది. మార్కెట్లో మాత్రం తగినంత టమాటాలు నిల్వ లేనందున ధరలు ఆకాశానంటుతున్నాయి.

Also read: Corona cases in India: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు- కొత్తగా 9,119 మందికి పాజిటివ్

Also read: Free Biryani For Tomatoes: బిర్యానీ లవర్స్ కు గుడ్ న్యూస్.. కేజీ టమాటాలకు బిర్యానీ ఉచితం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
As tomato prices hit All time high, Tamilnadu govt jumps into action
News Source: 
Home Title: 

Tomato prices: ప్రభుత్వం చొరవతో అక్కడ కిలో టమాటా ధర రూ.85-100..!

Tomato prices: ప్రభుత్వం చొరవతో అక్కడ కిలో టమాటా ధర రూ.85-100..!
Caption: 
Representative image (File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

టమాటా ధరలు కట్టడికి తమిళనాడు ప్రభుత్వం చర్యలు

ఇతర మార్కెట్ల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటన

సహకార శాఖ స్టోర్ల ద్వారా సబ్సిడీలో విక్రయం

Mobile Title: 
Tomato prices: ప్రభుత్వం చొరవతో అక్కడ కిలో టమాటా ధర రూ.85-100..!
ZH Telugu Desk
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, November 25, 2021 - 11:21
Request Count: 
56
Is Breaking News: 
No