బంగాళాఖాతంలో మరో అల్పపీడనం దూసుకొస్తోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏపీ, తమిళనాడు సరిహద్దు జిల్లాలకు మరోసారి భారీ వర్షాల అలర్ట్ జారీ అయింది.
ఏపీ-తమిళనాడు సరిహద్దు జిల్లాలకు భారీ వర్షాల(Heavy Rains) బెడద ఇంకా వెంటాడుతోంది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా వరదముంపుకు గురై తేరుకోకముందే మరోసారి వర్షాలు పడనున్నాయనే హెచ్చరిక ఆందోళన రేపుతోంది. రానున్న 24 గంటల్లో దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ (IMD)వెల్లడించింది. ఫలితంగా శీలంక, దక్షిణ తమిళనాడుపై తీవ్ర ప్రభావముంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
భారీ వర్షాల కారణంగా కరువుతో అల్లాడిన రాయలసీమ ఒక్కసారిగా వణికిపోయింది. వరద ముంపు నుంచి ఇంకా తేరుకోలేదు. రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షాలతో అల్లాడిపోయింది. ఇప్పుడు మరో ముప్పు ముంచుకొస్తోంది. అల్పపీడన ప్రభావంతో బుధవారం నుంచి మూడ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనే హెచ్చరికలున్నాయి. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు ప్రాంతీయులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. తమిళనాడు తరువాత ఈ అల్పపీడనం(Low Pressure) ప్రభావం రాయలసీమపై పడనుంది. చిత్తూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.
Also read: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అక్రమ రవాణా, ఒకేరోజు మూడు కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook