Heavy Rain Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మరోసారి వర్ష సూచన జారీ అయింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో పాటు నైరుతి రుతు పవనాల ప్రభావం కారణంగా రానున్న 3-4 రోజులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. అటు హైదరాబాద్ నగరంలో సైతం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన ఈదరు గాలులు వీచనున్నాయి. రానున్న మూడు రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. గంటకు 45-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్య కారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో సైతం రానున్న 3-4 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల, మెదక్, ఖమ్మం, అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, మహబూబాబాద్, మెదక్, మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఇక రాష్ట్రంలోని మరి కొన్ని జిల్లాల్లో రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా భూపాలపల్లి, కరీంనగర్, కొమరం భీమ్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. అదే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. హైదరాబాద్ నగరంలో సైతం ఇవాళ, రేపు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.
Also read: NEET UG 2024 ROW: నీట్ పై సుప్రీంకోర్టు తీర్పు, 720 పుల్ మార్కులు కోల్పోనున్న 44 మంది టాపర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook