Anand Mahindra On Cyrus Mistry Death: టాటా సన్స్ మాజీ సీఈవో సైరస్ మిస్త్రీ మరణం అందరిని షాకింగ్ కు గురి చేసింది. మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీతో పాటు జహంగీర్ పండోల్ చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గుజరాత్ నుంచి ముంబయి వస్తుండగా సూర్య నదిపై ఉన్న వంతెన వద్ద డివైడర్‌ను కారు ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. సైరస్ మిస్త్రీ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. కారు ప్రమాదానికి గురైన సమయంలో వెనుక సీటులో కూర్చున్న సైరస్ మిస్ట్రీ సీటు బెల్టు ధరించలేదని గుర్తించారు. సీటు బెల్టు లేకపోవడం వల్లే సైరస్ చనిపోయారని భావిస్తున్నారు.
సైరస్ మిస్ట్రీ ప్రమాదంపై వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో స్పందించారు. ప్రతి ఒక్కరూ సీటు బెల్టు ధరించాలని కోరారు. సీటు బెల్టు ప్రతిజ్ఞ తీసుకున్నారు ఆనంద్ మహీంద్రా. కారులో వెనుక సీట్లో కూర్చున్నా సరే ఎల్లప్పుడూ సీటు బెల్టు ధరించాలని నిశ్చయించుకున్నానని చెప్పారు. అందరూ ఆ ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరుతున్నా అంటూ ఆనంద్ ట్వీట్ చేశారు. అలా చేస్తే మన కుటుంబాలకు ఎంతగానో రుణపడి ఉన్నవాళ్లమవుతామని తెలిపారు.
I resolve to always wear my seat belt even when in the rear seat of the car. And I urge all of you to take that pledge too. We all owe it to our families. https://t.co/4jpeZtlsw0
— anand mahindra (@anandmahindra) September 5, 2022
కారు ప్రమాద సమయంలో జహంగీర్, సైరస్ మిస్ట్రీలు వెనుక సీట్లో కూర్చున్నారు. ప్రముఖ గైనకాలజిస్టు అనాహితా పండోల్ డ్రైవింగ్ చేస్తుండగా.. ఆమె భర్త డేరియస్ ముందు సీట్లో ఉన్నారు. సూర్య నది వద్ద రాంగ్ సైడ్‌లో మరో వెహికిల్ ను క్రాస్ చేసే ప్రయత్నంలో కారు కంట్రోల్ తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ప్రమాదానికి ముందు కారు 9 నిమిషాల్లోనే 20 కిలోమీటర్లు ప్రయాణిచిందని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం 2.21గంటల సమయానికి పాల్ ఘర్ ను చెక్‌పోస్ట్‌ను దాటింది కారు. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే డివైడర్ ను ఢీకొట్టింది. అప్పటికి కేవలం 9 నిమిషాల్లోనే సైరస్ మిస్ట్రీ ప్రయాణించిన కారు 20 కిలోమీటర్లు వెళ్లిందని అధికారులు గుర్తించారు.
Read Also: Telangana Assembly: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ.. బీజేపీ ఎల్పీ నేత ఎవరో?
Read Also: Ponguleti Srinivas Reddy: త్వరలోనే మంచి మార్గమట.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జంప్ అప్పుడేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి