ఉన్నావ్ అత్యాచార కేసులో.. బీజేపీ ఎమ్మెల్యే అరెస్టు

ఉన్నావ్‌ అత్యాచార ఘటన కేసుకు సంబంధించి ఎట్టకేలకు అలహాబాద్ కోర్టు స్పందించింది.

Last Updated : Apr 14, 2018, 10:03 AM IST
ఉన్నావ్ అత్యాచార కేసులో.. బీజేపీ ఎమ్మెల్యే అరెస్టు

ఉన్నావ్‌ అత్యాచార ఘటన కేసుకు సంబంధించి ఎట్టకేలకు అలహాబాద్ కోర్టు స్పందించింది. వెంటనే బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్‌ను అరెస్టు చేయాలని తెలిపింది. ప్రస్తుతం కులదీప్ సింగ్, 16 ఏళ్ల అమ్మాయిని గత సంవత్సరం అత్యాచారం చేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు ఆయనను సీబీఐ అధికారులు సాయంత్రం 4 గంటలకు విచారించనున్నారు.

ఈ కేసు పై తాము ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఇప్పటికే అలహాబాద్ కోర్టు తెలిపింది. ప్రస్తుతం ఈ కేసులో కులదీప్ సింగ్ పై మూడు కేసులు నమోదు అయ్యాయి. అందులో ఒకటి పోస్కో యాక్టు ప్రకారం నమోదు కాగా..  మిగతా రెండు అత్యాచార నేరానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్‌లవి. ఇటీవలే బాధితురాలి తండ్రిని పోలీసులు జైలుకి తీసుకెళ్లడం.. ఈ క్రమంలో ఆయన అనుమానస్పద రీతిలో మరణించడం లాంటి విషయాలు తెరమీదికొచ్చాక ఈ కేసు జాతీయ స్థాయిలో సంచలనమైంది. 

ఈ క్రమంలో ఎమ్మెల్యేపై ఎందుకు పోలీసులు తొలుత కేసు నమోదు చేయలేదు? బాధితురాలు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టంచుకోలేదు? అన్న అంశాలు తెరమీదికొచ్చాయి. అదే సమయంలో ఈ కేసులో విచారణ త్వరగా జరగాలని.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేని వెంటనే అరెస్టు చేయాలని కోర్టు తెలిపింది. గతంలో ఎమ్మెల్యే తమ్ముడు కూడా ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కోవడం విశేషం.

ఇదే కేసుకు సంబంధించి ఆగస్టు 17, 2017 తేదిన ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌కి కూడా ఉత్తరం రాసినట్లు అడ్వకేట్ జనరల్ రాఘవేంద్ర సింగ్ తెలిపారు. అయితే ఇప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే మాత్రం, బాధితురాలి మాటల్లో నిజం లేదని తెలపడం గమనార్హం. 

Trending News