Five State Elections: దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు వాయిదా వేయాలనే డిమాండ్ ఎక్కువవుతోంది.
దేశంలో త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ ఉంది. మరోవైపు దేశంలో కోవిడ్ 19 కు సంబంధించి నాన్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నాటికి దేశంలో కరోనా థర్డ్‌వేవ్ వస్తుందనే హెచ్చరికలు విన్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి. చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నైట్‌కర్ఫ్యూ అమల్లో ఉంది.
ఒమిక్రాన్ (Omicron Variant) సంక్రమణ నేపధ్యంలో యూపీ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించాలని..ఎన్నికల్ని వాయిదా వేయాలని అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) కేంద్రాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ విషయంపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలే చేసింది. మనుషులు ప్రాణాలతో ఉంటేనే కదా..ప్రచారమైనా, ఎన్నికలైనా అని వ్యాఖ్యానించింది. ఒకవేళ ఇప్పుడు చర్యలు తీసుకోకుంటే సెకండ్ వేవ్ కంటే ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.
ఇప్పుడు తాజాగా అఖిల భారత బార్ అసోసియేషన్ కూడా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి (Central Election Commission) లేఖ రాసింది. దేశంలో కరోనా , ఒమిక్రాన్ వేరియంట్ సంక్రమణ పెరుగుతున్న నేపధ్యంలో ఎన్నికల్ని వాయిదా వేయాలని సూచించారు. గతంలో అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికల కారణంగా సెకండ్ వేవ్ పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం కొత్త వేరియంట్లు విజృంభిస్తుండటంతో దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రజలకు కోవిడ్ ప్రోటోకాల్ పాటించకుండా పెద్ద సంఖ్యలో ఎన్నికల ర్యాలీలకు హాజరవుతున్నారని..ఒమిక్రాన్, కరోనా వైరస్ ముగిసేవరకూ ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని వాయిదా వేయకపోతే తీవ్ర పరిణామాలుండే అవకాశాలున్నాయని బార్ అసోసియేషన్ తెలిపింది.
కోవిడ్ సంక్రమణను దృష్టిలో ఉంచుకుని చైనా, నెదర్లాండ్స్, జర్మనీ దేశాల్లో పాక్షిక, సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారని బార్ అసోసియేషన్ (Bar Association) ఉదహరించింది. దేశ ప్రజల ఆరోగ్యం, భద్రతను పట్టించుకోకుండా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం చూస్తోందని బార్ అసోసియేషన్ ప్రతినిధులు విమర్శించారు. అందుకే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు.
Also read: PM Modi: మేజర్ ధ్యాన్‌చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని మోదీ శంకుస్థాపన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook