ఆధార్ లేకపోతే అడ్మిషన్ ఇవ్వరా ? స్పందించిన యూఐడీఏఐ!

ఆధార్ లేకపోతే అడ్మిషన్ ఇవ్వరా ?

Last Updated : Sep 7, 2018, 01:47 PM IST
ఆధార్ లేకపోతే అడ్మిషన్ ఇవ్వరా ? స్పందించిన యూఐడీఏఐ!

ఆధార్ కార్డు లేకపోతే పిల్లలకు పాఠశాలలో అడ్మిషన్ ఇవ్వరా ? ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తూ కొంతమంది లేఖలు, ఈమెయిల్స్ ద్వారా చేసిన అభ్యర్థనలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) స్పందించింది. ఆధార్ కార్డు లేని కారణంగా పిల్లలకు అడ్మిషన్ నిరాకరించడం సరైన చర్య కాదని ఈ సందర్భంగా యూఐడీఏఐ తేల్చిచెప్పింది. ఆధార్ కార్డు లేని కారణంగా పిల్లలకు పాఠశాలల్లో అడ్మిషన్లు నిరాకరించరాదని, ఏదైనా ఇతర గుర్తింపు పత్రాల ఆధారంగా అడ్మిషన్ కల్పించాలని యూఐడీఏఐ స్పష్టంచేసింది. ఆధార్ లేని కారణంగా అడ్మిషన్స్ నిరాకరిస్తే, అది చట్ట విరుద్ధమే అవుతుందని యూఐడీఏఐ అభిప్రాయపడింది. 

స్థానికంగా ఉండే బ్యాంకులు, పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలతో సమన్వయం చేసుకుని విద్యార్థులకు ఆధార్ కార్డులు అందేలా పాఠశాల ఆవరణలోనే ఎన్‌రోల్‌మెంట్ శిబిరాలు ఏర్పాటు చేసే బాధ్యత పాఠశాలలదేనని యూఐడీఏఐ గుర్తుచేసింది. ఈమేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ బుధవారమే ఉత్తర్వులు జారీచేసింది.

Trending News