పద్మావత్ ఎఫెక్ట్: ఆ నాల్గు రాష్ట్రాలపై కోర్టు ధిక్కరణ పిటిషన్

 బీజేపీ పాలిత ఆ నాల్గు రాష్ట్రాల్లో పద్మావత్ సినిమా విడుదల కాలేదు.

Last Updated : Jan 26, 2018, 12:09 AM IST
పద్మావత్ ఎఫెక్ట్:  ఆ నాల్గు రాష్ట్రాలపై కోర్టు ధిక్కరణ పిటిషన్

పద్మావత్ సినిమా ప్రదర్శకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను అడ్డుకోరాదని..చిత్ర ప్రదర్శనకు ఏర్పడే అడ్డంకులు తొలగించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనంటూ అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. అయినప్పటికీ గుజరాత్,  మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా రాష్ట్రాల్లో ఈ రోజు చిత్రం విడుదల కాలేదు. థియేటర్లను తగులబెడతారనే భయంతో షో వేయడానికి థియేటర్ యాజమాన్యాలు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో భద్రతాపరమైన చర్యలు తీసుకోవడంలో ఆ నాల్గు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వాలు గట్టిగా చర్యలు తీసుకున్నట్లయితే థియేటర్ యాజమాన్యాలు ముందుకొచ్చేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పద్మావత్ విషయంలో భద్రతా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్ నేత తహ్సేన్ పూనవల్ల  ఈ పిిటిషన్  వేసినట్లు సమాచారం

Trending News