Assam Earthquake: అసలే కరోనా మహమ్మారితో దేశమంతా సతమతమవుతుంటే, అస్సాంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై బుధవారం ఉదయం సంభవించిన ఈ భూకంపం తీవ్రతను 6.4గా నమోదైనట్లు జాతీయ సిస్మోలజీ కేంద్రం (National Centre of Seismology) వెల్లడించింది. తేజ్‌పూర్‌కు 43 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
ఆ తరువాత మూడు పర్యాయాలు భూప్రకంపనలు రావడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బిహార్‌లోనూ భూమి కంపించినట్లు సమాచారం. భారీ భూకంపం తరువాత తొలుత ఉదయం 8:13 గంటలకు, అనంతరం 8:25 మరియు 8:44 నిమిషాలకు భూప్రకంపనలు వచ్చినట్లు జాతీయ సిస్మోలజీ కేంద్రం తెలిపింది. వాటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0, 3.6 మరియు 3.6గా నమోదైంది.
Big earthquake hits Assam. I pray for the well being of all and urge everyone to stay alert. Taking updates from all districts. #earthquake
— Sarbananda Sonowal (@sarbanandsonwal) April 28, 2021
భారీ భూకంపంపై అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ స్పందించారు. అస్సాంలో భారీ భూకంపం సంభవించిందని, అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. అన్ని జిల్లాల నుంచి సమాచారం సేకరిస్తున్నామని ట్వీట్ చేశారు. భూకంప తీవ్రతకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
This is the first visual of the after-effects of the massive Earthquake in Assam. pic.twitter.com/dPYyKsSsXm
— atanu bhuyan (@atanubhuyan) April 28, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook