భర్త స్మార్ట్‌గా లేడని పెట్రోల్‌తో తగలెట్టేసింది !!!

ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలి ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది

Last Updated : Apr 17, 2019, 06:42 PM IST
భర్త స్మార్ట్‌గా లేడని పెట్రోల్‌తో తగలెట్టేసింది !!!

ఉత్తరప్రదేశ్‌ లో దారుణ ఘటన చోటు చేసుకుంది.  కట్టుకున్న భర్త నల్లగా ఉన్నాడని కారణంతో ఏకంగా పెట్రోల్ పోసి నిప్పంటించేంది భార్య.  ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానిక పోలీసులు కథనం ప్రకారం యూపీలోని బరేలిలో నివసిస్తున్న ప్రేమ్‌శ్రీ, సత్యవీర్‌సింగ్‌కు రెండేళ్ల కిత్రం పెళ్లైంది.. వీరిద్దరికి సంతానంగా ఐదు నెలల పాప ఉంది. తన భర్త సత్యవీర్‌ సింగ్‌ చూడటానికి స్మార్ట్ గా లేడని కారణంతో ప్రేమ్‌ శ్రీ  బాధపడేది. అతని శరీర రంగును ప్రస్తావిస్తూ ఎప్పుడు గొడవపడేది. 

ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసినప్పటికీ ఇదంతా సహజమేనని భావించి ఎవరూ పెద్దగా జోక్యం చేసుకోలేదు. అయితే ప్రేమ్‌శ్రీ వారు ఊహించని రితితో సోమవారం రాత్రి  ఘాతుకానికి పాల్పడింది. తన భర్తను నిద్రిస్తున్న సమయంలో అతనిపై పెట్రోల్‌ పోసి తగులబెట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన సత్యవీర్‌ సింగ్‌ ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. హత్యకు దారి తీసిన  కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దాడిలో ప్రేమ్‌శ్రీకి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం నిందితురాలు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.

Trending News