/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త వేచి చూస్తుంది. వాస్తవానికి 7వ వేతన సంఘం సిఫారసులను 2016లో అమలు చేశారు. ప్రస్తుతం ఏడవ వేతన సంఘం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాంతో కేంద్ర ప్రభుత్వం సర్వీసులలో ఉన్న ఉద్యోగుల జీతభత్యాలు నిర్ణయించడానికి 8వ వేతన సంఘం (8th Pay Commission)ను ఏర్పాటు చేయాలా వద్దా అనేదానిపై కొన్ని రిపోర్టులు వైరల్ అవుతున్నాయి.

అదే విధంగా రెండు వేర్వేరు విషయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతానికి కొత్త పే కమిషన్ ఏర్పాటు చేయడం వీలుకాదు. రెండో విషయం ఏంటంటే, కొత్త పే కమిషన్ ద్వారా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం నిర్ణయించనున్నారు. ఈ రెండు అంశాలపై కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయని తద్వారా వేతన సవరణ సంఘాలు ప్రత్యేక సూత్రానలు పాటించాల్సి ఉందని భావించారు. రోజువారీ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఉద్యోగుల జీతాన్ని పెంచడం మంచిదని కేంద్రంలోని ఆర్థిక నిపుణులు చర్చిస్తున్నారు.

Also Read: State Bank Of India: ఎస్‌బీఐ ఉద్యోగులకు శుభవార్త, వారికి బోనస్‌గా 15 రోజుల జీతం

పే కమిసన్‌కు సరికొత్త సూత్రం
కేంద్ర ఉద్యోగుల జీతభత్యాలు సవరించడం, పెంచడం గురించి ఫార్ములా ఐక్రోయిడ్ ఫార్ములా తెలుపనుంది. దాని ద్వారా ఉద్యోగి పనితీరుతో ఉద్యోగుల జీతం, ద్రవ్యోల్బణం, జీవన వ్యయం లాంటి విషయాలు ముడిపడి ఉంటాయి. పలు విషయాలు అంచనా వేసిన తర్వాతే ఉద్యోగి జీతం పెరుగుతుంది. ఇలా చేయడం సత్ఫలితాలు ఇస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. 7వ వేతన సవరణ సంఘం వరకు అలాంటి ఫార్ములా గురించి ఏ చర్చ జరగలేదు. కానీ 8వ వేతన సంఘం వస్తే ఈ తీరుగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని మాత్రమే సంకేతాలు వస్తున్నాయి. 

Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్లో స్థిరంగా బంగారం ధరలు, మళ్లీ క్షీణించిన వెండి ధరలు

7వ వేతన సంఘంపై ఏమేం చర్చించారు..
7వ వేతన సంఘం (7th Pay Commission) సిఫారసులో జస్టిస్ మథూర్ ఓ ఫార్ములా ద్వారా ఉద్యోగుల జీతభత్యాలను నిర్ణయించేలా చేసి ప్రతి ఏడాది సమస్య రాకుండా శాశ్వాత పరిష్కారం చూడాలని చర్చించారు. రోజువారీ ఖర్చులు పెరగడం లాంటి అంశాలతో వాలెస్ రుడెల్ ఈ ఫార్ములాను తీసుకొచ్చారు. సామాన్యులకు ఆహారం మరియు దుస్తులు అనేవి చాలా ముఖ్యమైనవని భావించాడు. వాటి ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగుల జీతం కూడా పెరగాలని సూచించాడు.

7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ .7 వేల నుంచి రూ .18 వేలకు పెంచింది. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను ప్రస్తుత ధరల సూచీ ప్రకారం ప్రభుత్వం సమీక్షించాల్సి ఉంటుందని జస్టిస్ మథూర్ తన  సిఫారసులో పేర్కొన్నారు. 8 వ వేతన సంఘం ఏర్పాటు గురించి చర్చించినట్లుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఏ విషయాలు వెల్లడించలేదు.

Also Read: India Corona Cases: భారత్‌లో 4 వేల దిగువకు COVID-19 మరణాలు, భారీగా డిశ్ఛార్జ్ కేసులు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
8th Pay Commission: What Is The New Formula To Decide Salary Of Central Govt Employees
News Source: 
Home Title: 

8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల వేతన సమస్యకు 8వ వేతన సంఘం చెక్ పెడుతుందా

8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల వేతన సమస్యకు 8వ వేతన సంఘం చెక్ పెడుతుందా
Caption: 
8th Pay Commission: What Is The New Formula To Decide Salary Of Central Govt Employees
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల వేతన సమస్యకు 8వ వేతన సంఘం చెక్ పెడుతుందా
Shankar Dukanam
Publish Later: 
No
Publish At: 
Sunday, May 23, 2021 - 12:12
Request Count: 
197
Is Breaking News: 
No