/telugu/photo-gallery/tspsc-group-4-final-result-2024-category-wise-selected-candidates-list-check-full-details-here-rn-180895 TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. 180895

7th Pay Commisson: 7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం జనవరి 2024 నుంచి పెరగాల్సిన డీఏ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న డీఏ పెంపుపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. మార్చ్ నెల జీతం భారీగా అందుకోనున్నారు. ఓ వైపు డీఏ పెంపు, మరోవైపు జీతంలో పెరుగుదల ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి రెండు నెలల ఎరియర్లతో సహా అందుకోనుండటంతో ఒకేసారి భారీ మొత్తం అందుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఈసారి 4 శాతం పెరగనుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిలో రెండుసార్లు డీఏ పెరుగుతుంది. మొదటిది జనవరి నెలలో ఉంటే, రెండవది జూలై నెలలో ఉంటుంది. గత ఏడాది అంటే 2023 జూలై డీఏ పెంపు 4 శాతం ప్రకటన అక్టోబర్ నెలలో వెలువడింది. దీపావళి కానుకగా ఎరియర్లతో పాటు జమ అయింది. దాంతో డీఏ 46 శాతానికి చేరుకుంది. ఇక ఈ ఏడాది జనవరిలో పెరగాల్సిన డీఏ కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం ఈసారి మరో 4 శాతం డీఏ పెరగవచ్చు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ డీఏ ప్రకటన మార్చ్ నెలలోనే ఉంటుంది. అంటే మార్చ్ నెల జీతంతో పాటు రెండు నెలల ఎరియర్లు కూడా కలుపుకుని అందుకోనున్నారు. అంటే మార్చ్ జీతం ఈసారి భారీగా అందనుంది. ఏఐసీపీఐ ఇండెక్స్‌ను ప్రతి నెలా కేంద్ర కార్మిక శాఖ జారీ చేస్తుంటుంది. ఇప్పుడు మరో 4 శాతం డీఏ పెరిగితే అది కాస్తా 50 శాతానికి చేరుకోనుంది. 

ఈ నెలలోనే హోళీకు ముందే డీఏ పెంపుపై ప్రకటన చేయనుంది కేంద్ర ప్రభుత్వం. అంటే మార్చ్ నెల జీతంతో పాటు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలల 4 శాతం డీఏ ఎరియర్లు అందనున్నాయి. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు నిర్ణయంతో 48.67 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 67.95 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. 

Also read: OTT and Theatre Releases: ఈ వారం ధియేటర్, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
7th pay commission updates on DA hike, central government employees will get 4 percent da hike from thim month march 2024 with two months arrears check new salary details rh
News Source: 
Home Title: 

7th Pay Commisson: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, డీఏ పెంపు మార్చ్ నుంచే

7th Pay Commisson: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, డీఏ పెంపు మార్చ్ నుంచే, భారీగా జీతం
Caption: 
7th pay commission ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
7th Pay Commisson: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, డీఏ పెంపు మార్చ్ నుంచే
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Sunday, March 3, 2024 - 20:43
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
34
Is Breaking News: 
No
Word Count: 
256