7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏ పెంపుపై ప్రకటన

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల 4 శాతం పెంచగా.. మరో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. 3 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో 2.15 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2023, 11:40 AM IST
7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. డీఏ పెంపుపై ప్రకటన

7th Pay Commission: హిమాచల్ దినోత్సవ ఆ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సుఖు గుడ్‌న్యూస్ చెప్పారు. ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం 31 శాతం డీఏ ఉండగా.. 34 శాతానికి పెంచారు. 76వ హిమాచల్ దినోత్సవ వేడుకలు రాజధానికి 325 కిలోమీటర్ల దూరంలోని లాహౌల్-స్పితి జిల్లాలోని కాజాలో నిర్వహించారు. ఈ సందర్భంగా 12 వేల అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం రాష్ట్రంలోని 2.15 లక్షల మంది ఉద్యోగులు, 90 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు సీఎం తీపికబురు అందించారు.  

డీఏ పెంపుతో రాష్ట్ర ఖజానాపై రూ.500 కోట్ల అదనపు భారం పడుతుంది. డీఏ పెంపుతో పాటు మేనిఫెస్టోలో హామీ ప్రకారం.. స్పితి వ్యాలీలో రెండవ దశలో జూన్ నుంచి 18 ఏళ్లు పైబడిన 9 వేల మంది మహిళలకు నెలవారీ రూ.1,500 భృతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హర్ ఘర్ లక్ష్మి, నారీ సమ్మాన్ నిధి అనే కార్యక్రమం కింద ఈ ప్రాంతంలోని మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వ చేయూతనందిస్తోంది. అంతేకాకుండా సుఖు కాజాలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ, కళాశాలను కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. స్పితి వ్యాలీలోని రాంగ్రిక్ వద్ద ఎయిర్‌స్ట్రిప్‌ను అభివృద్ధి చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. 

ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన మూడో దశలో భాగంగా రూ.34 కోట్లతో అతర్గు నుంచి పిన్‌వ్యాలీలోని మడ్‌ వరకు రోడ్డు నిర్మాణం చేపడుతున్న సీఎం సుఖ్‌విందర్ సుఖు వెల్లడించారు. అంతేకాకుండా ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్త‌యిన మ‌డ్‌తో భ‌వాను అనుసంధానించేలా రోడ్డు నిర్మాణానికి కూడా ప్ర‌భుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి అవుతుందని.. స్పితి శిలాజ గ్రామమైన లాంగ్జాలో స్టార్-గేజింగ్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 

Also Read: 8th Pay Commission: ఉద్యోగులకు కేంద్రం బంపర్ గిఫ్ట్.. 8వ వేతన సంఘంపై కీలక నిర్ణయం..?

ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌నుపునరుద్ధరిస్తామన్న హామీని నెరవేర్చి 1.36 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చామని ఆయన వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని 2.31 లక్షల మంది మహిళలకు దశలవారీగా నెలకు రూ.1500 ఇస్తున్నామని చెప్పారు. విధ్వా, ఏకల్‌ నారీ ఆవాస్‌ యోజన కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 7 వేల మంది మహిళలకు ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ల్యాండ్ హోల్డింగ్ సీలింగ్ యాక్ట్ 1972ను సవరించి పూర్వీకుల ఆస్తి యాజమాన్యంలో కుమార్తెలకు సమాన హక్కులు కల్పించినట్లు పేర్కొన్నారు.

Also Read: IPL Records: ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత చెత్త ఓవర్లు ఇవే.. ఆ ముగ్గురు బౌలర్లు ఎవరంటే..?    

Also Read: IPL Records: ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News