7th Pay Commission DA Hike: ఈ ఏడాది రెండో డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. రెండో డీఏ పెంపుపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. మార్చి నెల ఏఐసీపీఐ ఇండెక్స్ డేటాను కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి నెల తగ్గిపోగా.. మళ్లీ ఇండెక్స్ పాయింట్లలో పెరుగుదల కనిపించింది. ఇండెక్స్ పాయింట్ల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం డీఏను పెంచిన విషయం తెలిసిందే. గతంలో 38 శాతం డీఏ ఉండగా.. మార్చి నెలలో 4 శాతం పెంచింది. దీంతో మొత్తం డీఏ 42 శాతానికి చేరింది. కేంద్ర ఉద్యోగులకు డీఏ ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు సార్లు పెంచుతున్న విషయం తెలిసిందే. మొదటి పెంపు జనవరి నెలలో.. రెండో పెంపు జూలై నెలలో ఉంటుంది. ఇటీవల పెంచిన డీఏను జనవరి నెల నుంచి అమలు చేసింది. రెండో డీఏ ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై నెల నుంచి వర్తించనుంది.
గతేడాది డిసెంబర్ నెల వరకు ఏఐసీపీఐ ఇండెక్స్ గణాంకాల ఆధారంగా జనవరికి డియర్‌నెస్ అలవెన్స్ మార్చి నెలలో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఏఐసీపీఐ ఐండెక్స్ పాయింట్ల ప్రాతిపదికగా జూలైకి సంబంధించిన డీఏను నిర్ణయించనుంది. జనవరిలో ఇండెక్స్ 132.8 పాయింట్లకు పెరిగింది. ఫిబ్రవరిలో క్షీణించి 132.7 పాయింట్లకు చేరుకోగా.. మార్చిలో మళ్లీ పుంజుకుని 133.3 పాయింట్లకు చేరుకుంది.
ఫిబ్రవరిలో 132.7 సంఖ్య ఆధారంగా డీఏ 44 శాతానికి చేరుకుంది. మార్చి నెల ఏఐసీపీఐ ఇండెక్స్ పాయింట్ల పెరుగుదలతో ఈసారి 44 శాతం దాటిపోయింది. జూన్ వరకు విడుదల అయ్యే ఇండెక్స్ డేటా ఆధారంగా.. జూలై నెల డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త డియర్‌నెస్ అలవెన్స్‌ను సెప్టెంబర్‌లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇది జూలై 1 నుంచి అమలులోకి వస్తుంది.
ఏఐసీపీఐ ఇండెక్స్ డేటాను బట్టి డియర్‌నెస్ అలవెన్స్‌లో ఎంతమేరకు పెంపుదల ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి నెలా చివరి పనిదినం నాడు కార్మిక మంత్రిత్వ శాఖ అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక (ఏఐసీపీఐ) గణాంకాలను విడుదల చేస్తుంది. ఈ సూచిక దేశం మొత్తం 88 కేంద్రాల కోసం తయారు చేశారు. ప్రభుత్వం డీఏ పెంపుతో 52 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 48 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనకరంగా ఉండనుంది. ఉద్యోగులకు డీఏ పెరగనుండగా.. పెన్షనర్లకు డీఆర్ పెరగనుంది.
Also Read: Telangana Corona Cases: భారీగా తగ్గిన కరోనా కేసులు.. తెలంగాణలో ఎన్నంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook