7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్ వచ్చేసింది. కొత్త సంవత్సరంలో డీఏ పెంపుపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ద్వారా ఈ విషయం వెల్లడైంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రతి ఏడాది రెండు సార్లు పెంచుతున్న విషయం తెలిసిందే. మొదటి పెంపు జనవరి నెలలో, రెండో పెంపు జూలై నెలలో ఉంటుంది. కొత్త సంవత్సరం ప్రారంభమైనందున ఉద్యోగులు తమ డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. జనవరి నెలకు సబంధించిన డీఏ పెంపు ప్రకటన మార్చిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే డీఏ పెంపులో ఊహించిన దాని కంటే తక్కువగా ఉండవచ్చు.
జూలై నుంచి నవంబర్ వరకు ఏఐసీపీఐ ఇండెక్స్ సంఖ్య పెరిగింది. కానీ డిసెంబర్లో తగ్గుదల నమోదైంది. జనవరి 1 నుంచి పెరిగిన డియర్నెస్ అలవెన్స్‌ని ఇప్పుడు దాని ఆధారంగా తగ్గించవచ్చు. అయితే అక్టోబరు, నవంబర్ల గణాంకాలు అలాగే ఉన్నాయి. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో 132.3 పాయింట్లకు పడిపోయింది. అక్టోబర్, నవంబర్లలో ఈ సంఖ్య 132.5 పాయింట్లుగా ఉంది. సెప్టెంబర్‌లో 131.3, ఆగస్టులో 130.2, జూలైలో 129.9గా నమోదైంది.
డీఏ 3 శాతం పెరగవచ్చు
జనవరి 31న డిసెంబరులో ఏఐసీపీఐ ఇండెక్స్ గణాంకాలను కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ డేటా ఆధారంగా జనవరి 1 నుంచి ఉద్యోగుల డీఏ పెంపుదల 4 శాతానికి బదులుగా 3 శాతం కావచ్చు. అంటే ఫిగర్ తగ్గడం వల్ల నేరుగా ఉద్యోగులకు ఒక శాతం నష్టం వాటిల్లవచ్చు. ఈ పెంపును ప్రభుత్వం మార్చిలో ప్రకటించనుంది.
జూలైలో డీఏను 4 శాతం పెంచిన తర్వాత కేంద్ర ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ 38 శాతానికి పెరిగింది. ఇప్పుడు అందులో 3 శాతం పెరిగితే అది 41 శాతానికి పెరుగుతుంది. ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా డియర్నెస్ అలవెన్స్‌లో ఎంతమేరకు పెంపుదల ఉండాలనేది నిర్ణయిస్తారు. ప్రతి నెలా చివరి పనిదినం నాడు కార్మిక మంత్రిత్వ శాఖ అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక (AICPI) గణాంకాలను విడుదల చేస్తుంది. ఈ సూచిక 88 కేంద్రాలకు, దేశం మొత్తం కోసం తయారు చేశారు.
Also Read: MS Dhoni: పోలీస్ ఆఫీసర్‌గా ఎంఎస్ ధోని.. లుక్ అదిరిపోయిందిగా..
Also Read: Secretariat Fire Accident: కొత్త సచివాలయం అగ్నిప్రమాద ఘటనలో ట్విస్ట్.. కారణం అదేనా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook