7th Pay Commission DA Hike News: త్రిపుర ప్రభుత్వ ఉద్యోగులకు మాణిక్ సాహా సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఐదు శాతం అదనపు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంచనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. 5 శాతం డియర్‌నెస్ అలవెన్స్ అందజేయనున్నట్లు సీఎం మాణిక్ సాహా తెలిపారు. పెంచిన డీఏ, డీఆర్ జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. హోలీ పండుగకు ముందు ప్రభుత్వం శుభవార్త చెప్పడంతో ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 1,06,932 మంది ఉద్యోగులు, 82 వేల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుందని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ పెంపు తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే కరువు భత్యం 25 శాతానికి పెరుగుతుందన్నారు. తాజా పెంపుతో ప్రభుత్వంపై రూ.500 కోట్ల అదనంగా భారం పడనుంది.
Also Read: No Water Supply : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈనెల 9, 10 తేదీల్లో నీటి సరఫరా బంద్..
"ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్నాం. వారికి ఐదు శాతం డీఏని ప్రకటించడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఉన్నా.. మా ప్రభుత్వం ఉద్యోగుల శ్రేయస్సుకు కట్టుబడి ఉంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి రూ.500 కోట్లు అదనపు వ్యయం అవుతుంది.." అని సీఎం మాణిక్ సాహా అసెంబ్లీలో వెల్లడించారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం జీతాల పెంపు భారీగా ఉంటుందని నమ్మకంతో ఉన్నారు. మరోసారి 4 శాతం డీఏ పెంపు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 46 శాతం డీఏ పొందుతున్న విషయం తెలిసిందే. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం.. మొత్తం డీఏ 50 శాతానికి చేరితే హౌస్ రెంట్ అలవెన్స్, పిల్లల చదువుల భత్యం, రవాణా భత్యం తదితరాలలో కూడా పెంపుదల ఉండనుంది.
కేంద్ర ప్రభుత్వ నుంచి డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. మూడు నెలల బకాయిలను ప్రభుత్వం ఒకేసారి ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో జమ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వినియోగదారుల ధరల సూచిక (CPI-IW) ఆధారంగా డీఏను పెంచనుంది. చివరగా గతేడాది అక్టోబర్ 18న డీఏ పెంపును మోదీ సర్కారు ప్రకటించింది. ఇది జూలై 1వ తేదీ నుంచి అమలు చేసింది. గతేడాది రెండుసార్లు డీఏను 4 శాతం చొప్పున పెంచింది. దీంతో 46 శాతానికి చేరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీకి ముందు సూపర్ గిఫ్ట్.. సర్‌ప్రైజ్ వచ్చేసిందిగా..