7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ న్యూస్.. ఒకేసారి జీతంలో రూ.8 వేలు పెంపు..!

7th Pay Commission Fitment Factor Hike: పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ పెంపుపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jan 13, 2024, 09:25 AM IST
7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ న్యూస్.. ఒకేసారి జీతంలో రూ.8 వేలు పెంపు..!

7th Pay Commission Fitment Factor Hike: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్‌పై ప్రభుత్వ ఉద్యోగులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. బడ్జెట్ 2024లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై కూడా నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. క్యాబినెట్ ఆమోదించిన తర్వాత.. బడ్జెట్ వ్యయంలో చేర్చనున్నారు. అదేవిధంగా బడ్జెట్‌ వల్ల ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని.. సామాన్యుల చేతుల్లోకి వచ్చే డబ్బు పెరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న చేస్తుండగా.. ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని నమ్మకంతో ఉన్నారు. 

ఈ ఏడాది ఏప్రిల్-మేలో దేశంలో ఎన్నికలు జరగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. డీఏ 4 శాతం పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రస్తుతం డీఏ 46 శాతం అందుతుండగా.. 4 శాతం పెంచితే 50 శాతానికి చేరుతుంది. మార్చి నెలలో డీఏ ప్రకటన ఉండే అవకాశం ఉండగా.. ఎన్నికల సంవత్సరం కావడంతో ఎప్పుడైనా కేంద్ర ప్రకటించవచ్చని అంటున్నారు. అయితే ప్రభుత్వం నుంచి డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జనవరి 1వ తేదీ నుంచి జీతాల పెంపు వర్తించనుంది. చివరిసారిగా గతేడాది దీపావళి కానుకగా 4 శాతం పెంచగా.. జూలై 1వ తేదీ నుంచి అమలు చేసిన విషయం తెలిసిందే. 

బడ్జెట్ 2024లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మంత్రివర్గం ఆమోదించిన తర్వాత.. అది బడ్జెట్ వ్యయంలో చేర్చే అవకాశం ఉందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచితే ఆటోమేటిక్‌గా కేంద్ర ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. ఫిట్‌మెంట్ అంశం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రాథమిక వేతనాన్ని నిర్ణయిస్తుంది. బేసిక్ శాలరీ ఆధారంగా అలవెన్సులు కూడా నిర్ణయిస్తారు.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను చివరిసారిగా 2016లో పెంచిన విషయం తెలిసిందే. ఉద్యోగుల కనీస మూల వేతనం రూ.6 వేల నుంచి రూ.18 వేలకి పెరిగింది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌లో ఈసారి పెంపుదల ఉంటే.. బేసిక్ పే రూ.26 వేలకు చేరుతుంది. ప్రస్తుతం ఉన్న రూ.18 వేల నుంచి అది రూ.26 వేలకు పెరగనుంది. అంటే బేసిక్ జీతంలో ఒకేసారి రూ.8 వేలు పెరుగుదల ఉండనుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఎన్నికల వేళ ఉద్యోగుల జీతాల్లో భారీ పెంపు ఉంటుందో లేదో చూడాలి మరి.

Also Read: Saindhav Twitter Review: సైంధవ్ ట్విట్టర్ రివ్యూ.. ఇది పెద్దోడి విశ్వరూపం.. వెంకీ మామ హిట్ కొట్టేశాడా..?  

Also Read: January Bank Holidays List: బిగ్ అలర్ట్.. బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు..!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News