ఏప్రిల్‌లో మార్కెట్‌లోకి 5G స్మార్ట్‌ఫోన్స్

ఏప్రిల్‌లో మార్కెట్‌లోకి 5G స్మార్ట్‌ఫోన్స్

Last Updated : Mar 6, 2019, 09:30 AM IST
ఏప్రిల్‌లో మార్కెట్‌లోకి 5G స్మార్ట్‌ఫోన్స్

సియోల్: ఏప్రిల్ నెలలో మార్కెట్‌లోకి 5G స్మార్ట్ ఫోన్స్ రానున్నాయని స్మార్ట్ ఫోన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. 5G నెట్‌వర్క్ ఉపయోగించడానికి అనుగుణంగా రూపొందించిన ఈ స్మార్ట్ ఫోన్స్ ఇప్పటికే మార్కెట్‌లోకి రావాల్సి వున్నప్పటికీ.. విడిభాగాల సరఫరా, ప్రయోగ పరీక్షల్లో జాప్యమే ఆలస్యానికి కారణమైందని పరిశ్రమవర్గాలు వెల్లడించాయి. 5G నెట్‌వర్క్ వినియోగానికి అనుకూలంగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెని రూపొందించిన గెలాక్సీ ఎస్ 10 స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ మొదటి వారంలో కానీ లేదా రెండో వారంలో కానీ మార్కెట్‌లోకి విడుదలయ్యే అవకాశాలున్నాయని సమాచారం. 

యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ రూపొందించిన V50 థింక్ స్మార్ట్ ఫోన్ సైతం ఏప్రిల్ రెండో వారంలో మార్కెట్‌లోకి విడుదలవనుందని తెలుస్తోంది.

Trending News