కర్ణాటకలోని తుమకూరులో (Tumakuru in Karnataka ) ఒక పశువుల కాపరికి కరోనా పాజిటీవ్ ( corona Positive )అని తేలడంతో దాదాపు 50 మేకలు, గొర్రెలను క్వారంటైన్‌కు ( Goats Quarantine ) తరలించినట్టు అధికారులు తెలిపారు.
తుమకూరులోని గోడెకెరె గ్రామంలో కొన్నిమేకలు,గొర్రెలు ( Sheeps Quarantined ) శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు గ్రామస్థులు గమనించారు. ఆ విషయాన్ని స్థానిక అధికారులకు తెలియజేశారు. అయితే అక్కడికి చేరుకున్న అధికారులు పశువుల కాపరికి కరోనా ( Covid 19 to Shepard ) ఉన్నట్టు తెలుసుకుని వెంటనే 50 మేకలను, గొర్రెలను క్వారంటైన్ చేశారు. వాటికి శ్వాస సంబంధిత సమస్య ఉన్నట్టు నిర్థారించారు. Also Read : Patanjali: ‘కరోనా మెడిసినా.. అలాంటిదేం తయారు చేయలేదు
ఈ విషయంలో తొలూత గ్రామస్తులు కర్ణాటక లా అండ్ పార్లమెంటరీ ఎఫైర్ మినిస్టర్ జేసీ మధుస్వామిని ( Karnataka Law Minister Madhuswami ) కలిసి విషయాన్ని తెలియజేశారు. దీంతో ఈ విషయంలో దర్యాప్తు చేయమని యానిమల్ హజ్బెండరీ డిపార్ట్మెంట్కు ( Animal Husbandry Department )ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు గ్రామానికి వెళ్లి సాంపిల్స్ సేకరించారు. వాటిని భోపాల్ లోని యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్ అండ్ వెటర్నరీ లాబోరేటరీకి పంపించారు. Also Read : చైనాలో జి4 వైరస్ కలకలం..
అయితే అధికారులు మాత్రం ఇప్పటి వరకు మేకలు లేదా గొర్రెలకు కరోనా వచ్చిన దాఖలాలు లేవని.. అయితే తుమకూరు ఘటనలో పెస్టె డెస్ పెటిట్స్ రుమినాంట్స్ ( Peste Des Petits Ruminants ) అనే మైకోప్లాస్మ ఇన్ఫెక్షన్ (Mycoplasma Infection ) లక్షణాలు ఉన్నట్టు తేల్చారు. దీనినే గోట్ ప్లాగ్ ( Goat Plague) అంటారని తెలిపారు. ఇది అంటువ్యాధి కావడంతో ఇతర జంతువులకు సోకకుండా వాటిని క్వారెంటైన్ చేసినట్టు అధికారులు వివరించారు.
Goats Quarantined : పశువుల కాపరికి కరోనా…50 మేకలు క్వారంటైన్