జనవరి 1, 2018 తేదిన బెంగుళూరులో పుట్టే తొలి బాలికకు బంపర్ బహుమతిని ఇవ్వనున్నట్లు ఆ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. బీబీఎంపీ (బృహత్ బెంగళూరు మహానగర పాలికే) ఆసుపత్రుల్లో ఆ రోజున జన్మించిన తొలి ఆడ శిశువుకు నగదు ప్రోత్సహకం క్రింద 5 లక్షల రూపాయలను ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా బెంగుళూరు మేయర్ సంపత్ రాజ్ మీడియాకి తెలిపారు.
ఆ రోజున పుట్టే బాలిక పేరు మీద ఒక బ్యాంకు అకౌంటు ప్రారంభించి.. అందులో కార్పొరేషన్ వారు 5 లక్షల రూపాయలను డిపాజిట్ చేస్తారు. ఆ డబ్బుపై వచ్చే వడ్డీని బాలిక చదువుకి తల్లిదండ్రులు ఉపయోగించవచ్చు. అలాగే ఆ బాలిక మైనారిటీ తీరాక.. ఆ డబ్బును ఆమె ఉన్నత చదువుల కోసం లేదా వివాహం కోసం తల్లిదండ్రులు వినియోగించవచ్చని జిల్లా మేయర్ తెలియజేశారు.