Uttarakhand: ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. చిక్కుకుపోయిన 300 మంది టూరిస్టులు..

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 300 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. లిపులేఖ్‌-తవాఘాట్‌ రహదారి కొట్టుకుపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 1, 2023, 05:32 PM IST
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. చిక్కుకుపోయిన 300 మంది టూరిస్టులు..

Landslide in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో కొండచరియలు బీభత్సం సృష్టించాయి. పితోర్‌ఘర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో కీలకమైన రహదారి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. జిల్లాలోని లఖన్‌పూర్‌ సమీపంలోని ధార్చుల ఎగువన 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిపులేఖ్‌-తవాఘాట్‌ రహదారి 100 మీటర్ల మేర కొట్టుకుపోవడంతో ప్రయాణికులు ధార్చుల, గుంజీల్లో చిక్కుకుపోయారు. ప్రయాణికుల రాకపోకల కోసం రెండు రోజుల తర్వాత ఈ రోడ్డును తెరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

రాష్ట్రంలోని అల్మోరా, బాగేశ్వర్, చమోలి, చంపావత్, డెహ్రాడూన్, గర్వాల్, హార్ద్వార్, నైనిటాల్, పితోర్‌గఢ్, రుద్రప్రయాగ్, తెహ్రీ గర్వాల్, ఉధమ్ సింగ్ నగర్ మరియు ఉత్తరకాశీ జిల్లాల్లో దుమ్ము తుఫాను, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. యాత్రికులందరూ సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని పోలీసులు సూచించారు. 

"యమునోత్రి మరియు గంగోత్రి ధామ్ యాత్రకు వచ్చే భక్తులందరూ వాతావరణ సూచన తీసుకున్న తర్వాత తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని... ప్రయాణ సమయంలో రెయిన్ కవర్, గొడుగు మరియు ఉన్ని/వెచ్చని దుస్తులను తమతో ఉంచుకోవాలని" అధికారులు తెలిపారు. ప్రతి ఏటా ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. తాజా ఘటనతో చాలా మంది తమ ఫ్లాన్స్ మార్చుకునే అవకాశం ఉంది.

Also Read: Telangana- Andhra Super fast Railway: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. ఈ మార్గాల్లో రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News