ఢిల్లీ నుండి అమృత్‌సర్‌కి ఈ ఏడాది ఏప్రిల్‌లో వెళ్లిన ఇండిగో విమానంలో దోమల గురించి ఫిర్యాదు చేసిన ముగ్గురు న్యాయవాదులకు ఒక్కొక్కరికి రూ.40,000 చెల్లించాలని వినియోగదారుల ఫోరమ్ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించింది. విమాన ప్రయాణంలో ఎయిర్‌లైన్స్ తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని.. ప్రయాణీకుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆ ముగ్గురు న్యాయవాదులు వినియోగదారుల ఫోరమ్‌కు ఫిర్యాదు చేయగా.. ఫోరమ్ పైవిధంగా స్పందించింది. విమానంలో దోమలతో పాటు కీటకాలున్నట్లు గుర్తించి...ప్రయాణికులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు సమాధానమిస్తూ.. 'ఇలాంటి సంఘటనలు జరగకుండా అనేక చర్యలు తీసుకుంటున్నట్లు.. కానీ కీటకాలు, పురుగుల సమస్యను కొన్ని సందర్భాల్లో పూర్తిగా నివారించపోవచ్చు' అని ఫోరమ్‌కి తెలిపింది. అయితే వినియోగదారుల ఫోరమ్.. ఎయిర్‌లైన్స్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందలేదు. దాంతో ఫిర్యాదు చేసిన ముగ్గురికి ఎయిర్‌లైన్స్ ఒక్కొక్కరికి 40 వేల రూపాయలను చెల్లించాలని, ఎయిర్‌లైన్స్ మరియు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వినియోగదారుల ఖాతాకి 15 వేలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. దీంతో మొత్తం ముగ్గురు లాయర్లకు 1.35 లక్షల పరిహారాన్ని ఇండిగో చెల్లించింది.