మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. 12 మంది మృతి

టెక్నాలజీ ఎంత పెరిగినా.. రోడ్డు ప్రమాదాలలో ఎలాంటి మార్పు లేకుండా ఉంది. చిన్న రోడ్లే కాదు హైవేల పై కూడా రోడ్డు ప్రమాదాలు చాలా పెరిగాయి. నాగ్‌పూర్‌ - పూణె హైవేపై ఉదయం బస్సు మరియు ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 గురు మృతి చెందారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2023, 03:23 PM IST
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. 12 మంది మృతి

ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా రోడ్డు ప్రమాదాల విషయంలో మార్పు రావడం లేదు. ఒకప్పుడు సింగిల్ రోడ్లు అవ్వడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యాయి అనుకుంటే ఇప్పుడు పెద్ద రోడ్లు అయినా కూడా యాక్సిడెంట్స్ తగ్గడం లేదు. డబుల్ రోడ్లు.. నాలుగు లైన్ల రోడ్ల పై కూడా తరుచు యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి.

ప్రతి రోజు యాక్సిడెంట్స్ వార్తలు చూస్తూనే ఉన్నాం. ఒకరు ఇద్దరు చనిపోయిన యాక్సిడెంట్స్ ను జనాలు పట్టించుకోనంత కామన్ అయ్యింది. నేడు ఉదయం జరిగిన యాక్సిడెంట్‌ లో ఏకంగా ఏడుగురు మృతి చెంది 13 మంది తీవ్రంగా గాయపడటం జరిగింది. ప్రమాద స్థలం లో ఉన్నవారు యాక్సిడెంట్‌ అత్యంత భయంకరంగా జరిగింది అంటున్నారు. 

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ - పూణె హైవేపై ఉదయం బస్సు మరియు ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి చూస్తూ ఉంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: GT vs CSK Qualifier 1: అన్ని గుజరాత్ టైటాన్స్‌కే అనుకూలం.. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓటమి తప్పదా?  

ఈ యాక్సిడెంట్‌ కు కారణం అతి వేగం అయ్యి ఉంటుందని పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. బస్సు మెహ్‌కర్‌ నుండి పూణే వెళ్తుంది. బస్సు మరియు ట్రక్‌ ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. 

ఉదయం యాక్సిడెంట్ లో ఏడు మంది మృతి చెందగా.. ఈ యాక్సిడెంట్‌ కు కొన్ని గంటల ముందు ట్రక్‌ మరియు ఎస్‌యూవీ కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు మృతి చెందారు ఏడుగురు గాయపడ్డారు. అమరావతి సమీపంలో దరియాపూర్‌ ' అంజంగావ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. 

యాక్సిడెంట్‌ కు గురి అయిన వారు దరియాపూర్ లో జరిగిన ఒక ఫంక్షన్ కు హాజరు అయ్యి తిరిగి వెళ్తుండగా ఆ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. మహారాష్ట్రలో  24 గంటల వ్యవదిలో రెండు ప్రమాదాలు జరిగి 12 మంది మృతి చెందారు. యాక్సిడెంట్స్ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయని.. ముందు ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని బాధితుల తరపు వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: MP YS Avinash Reddy: ఎంపీ అవినాష్‌ రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News