Hyderabad: ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి చంపేసిన తండ్రి.. వెంటనే తానూ కూడా..!

Hyderabad Crime News: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. తన ఇద్దరు కుమార్తెలకు స్లీపింట్ టాబ్లెట్స్ వేసి చంపేసి.. తానూ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో చోటు చేసుకున్న ఈ విషాదఘటన వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2023, 10:36 AM IST
Hyderabad: ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి చంపేసిన తండ్రి.. వెంటనే తానూ కూడా..!

Hyderabad Crime News: హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన ఇద్దరు కుతుళ్లకు నిద్ర మాత్రలు చేసి చంపేసిన ఓ తండ్రి.. ఆ తరువాత తానూ కూడా వాటిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని ఓల్డ్ బోయిన్‌పల్లి భవాని నగర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పూర్తి వివరాలు ఇలా.. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భవనీ నగర్‌లో శ్రీకాంత్ ఆచారి (42) అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. వెండి వ్యాపారం చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యా, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొంతకాలంలో కుటుంబంలో కలహాలు నెలకొన్నాయి.

రాత్రి పడుకునే ముందు ఇద్దరు కూతుళ్లు ఎనిమిదేళ్ల స్రవంతి, ఏడేళ్ల శ్రావ్యను తన దగ్గరే పడుకోబెట్టుకున్న శ్రీకాంత్ ఆచారి.. నిద్రమాత్రలు మింగించి ఆ తరువాత తాను కూడా మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం భార్య లేచి చూసేసరికి ముగ్గురు విగత జీవులుగా కనిపించారు. ఒకే ఇంట్లో ఇద్దరు చిన్నారులు, తండ్రి చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వగా.. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. విచారణలో పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

Also Read: Minor Sisters Killed: ప్రియుడితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన అక్క.. చెల్లెళ్లు చూశారని దారుణం..!  

Also Read: When Children Have Children: బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం.. 'వెన్ చిల్డ్రన్ హావ్ చిల్డ్రన్' బుక్ ఆవిష్కరణ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News