/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

4th Phase Lok Sabha Polls  దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్ల‌కు 7 విడతల్లో ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ సిద్ధమైంది. ఇప్ప‌టికే మూడు విడ‌త‌ల్లో 283 స్థానాల‌కు పోలింగ్ పూర్తైయింది. నేటి సాయంత్రం 5 గంట‌ల‌కు దేశ వ్యాప్తంగా ఎన్నిక‌లు జ‌రిగే లోక్ స‌భ సీట్ల‌కు ప్ర‌చారం ప‌ర్వం ముగియ‌నుంది. తెలంగాణ‌లోని 17 లోక్ స‌భ సీట్ల‌తో పాటు.. ఏపీలో 25 పార్ల‌మెంట్ సీట్ల‌తో పాటు 175 అసెంబ్లీ సీట్లతో పాటు దే వ‌వ్యాప్తంగా 96 లోక్ స‌భ సీట్ల‌కు నాల్గో విడ‌త‌లో ఎన్నిక‌ల జ‌ర‌గనున్నాయి.

ఈ సారి ఏపీ అసెంబ్లీ బ‌రిలో పులివెందుల నుంచి వై.య‌స్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రోసారి పోటీ చేయ‌నున్నారు. ముఖ్య‌మంత్రిగా ఉంటూ ఈ సీటులో పోటీ చేయ‌డం ఇదే తొలిసారి. మ‌రోవైపు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత టీడీపీ జాత‌య అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు కుప్పం నుంచి బ‌రిలో ఉన్నారు. అటు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్.. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాల‌నే ప‌ట్టుద‌ల‌తో కూట‌మి ఏర్పాటులో కీల‌క పాత్ర పోషించారు. ఇక చంద్ర‌బాబు వియ్యంకుడు బాల‌కృష్ణ.. హిందూపూర్ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా హాట్రిక్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అటు నారా లోకేష్. మంగ‌ళ‌గిరి నుంచి ఎమ్మెల్యేగా ఎలాగైనా గెలవాల‌నే క‌సితో ఉన్నారు. అటు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు.. పురంధేశ్వ‌రి రాజ‌మండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. క‌డ‌ప నుంచి వైయ‌స్ ష‌ర్మిలా  ఎంపీగా కాంగ్రెస్ పార్టీ త‌రుపున‌ పోటీ చేస్తున్నారు. ఇక ఉమ్మ‌డి ఏపీ చివ‌రి ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి బీజేపీ త‌రుపున బ‌రిలో ఉన్నారు.   అటు బాల‌య్య రెండో అల్లుడు విశాఖ ప‌ట్నం బ‌రిలో ఉన్న ప్ర‌ముఖులు అని చెప్పాలి.  

తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి బీజేపీ త‌రుపున కిష‌న్ రెడ్డి, బీఆర్ఎస్ త‌రుపున ప‌ద్మారావు గౌడ్, కాంగ్రెస్ పార్టీ త‌రుపున దానం నాగేంద‌ర్ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో త‌మ ల‌క్‌ను ప‌రీక్షించుకోనున్నారు. అటు క‌రీంన‌గ‌ర్ నుంచి బీజేపీ త‌రుపున బండి సంజ‌య్.. నిజామాబాద్‌లో బీజేపీ త‌రుపున ధ‌ర్మ‌పురి అరవింద్.. మ‌హ‌హూబ్ నగ‌ర్ నుంచి బీజేపీ త‌రుపున డీకే అరుణ.. కాంగ్రెస్ పార్టీ త‌రుపున వంశీ చంద్ రెడ్డి.. బ‌రిలో ఉన్నారు. అటు నాగ‌ర్ క‌ర్నూల్ నుంచి బీఆర్ఎస్ త‌రుపున మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్. ప్ర‌వీణ్ కుమార్.. బీజేపీ త‌రుపున భ‌ర‌త్.. కాంగ్రెస్ త‌రుపున మ‌ల్లు ర‌వి పోటాపోటీగా ఎన్నిక‌ల గోదాలో ఉన్నారు. అటు హైద‌రాబాద్ స్థానం నుంచి ఏఐఎంఐఎం తరుపున అస‌దుద్దీన్ ఐదోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయ‌న‌కు ప్ర‌త్య‌ర్ధిగా బీజేపీ త‌రుపున మాధ‌విల‌తా నువ్వా నేనా అన్న‌ట్టు ఫైట్ ఇవ్వ‌బోతుంది. వీరిలో ఎవ‌రి భ‌విత‌వ్యం ఎలా ఉంద‌నేది జూన్ 4న ఎన్నిక‌ల ఫ‌లితాల రోజు వెలుబ‌డ‌నుంది.

Also Read: KTR: ఎన్నికల్లో 12 ఎంపీలు ఇవ్వండి.. కేసీఆర్‌ను సీఎం చేద్దాం: కేటీఆర్‌ పిలుపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
4th Phase Lok Sabha Polls 2024 The campaign for the 4th phase of elections including Telangana and AP ends today ta
News Source: 
Home Title: 

4th Phase Lok Sabha Polls 2024: నేటితో తెలంగాణ‌, ఏపీ స‌హా 4వ విడ‌త ఎన్నిక‌ల ప్ర‌చారానికి ముగింపు..

4th Phase Lok Sabha Polls 2024: నేటితో తెలంగాణ‌, ఏపీ స‌హా 4వ విడ‌త ఎన్నిక‌ల ప్ర‌చారానికి ముగింపు..
Caption: 
4th Phase Elections (X/Photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
నేటితో తెలంగాణ‌, ఏపీ స‌హా 4వ విడ‌త ఎన్నిక‌ల ప్ర‌చారానికి ముగింపు..
TA Kiran Kumar
Publish Later: 
No
Publish At: 
Saturday, May 11, 2024 - 09:37
Created By: 
Kiran Kumar
Updated By: 
Kiran Kumar
Published By: 
Kiran Kumar
Request Count: 
30
Is Breaking News: 
No
Word Count: 
339