Zinc Deficiency: జింక్ లోపముంటే అంత ప్రమాదమా, జింక్ లోపంతో కన్పించే లక్షణాలేంటి

Zinc Deficiency: శరీర నిర్మాణం, ఆరోగ్యం కోసం చాలా రకాల విటమిన్లు, మినరల్స్ అవసరమౌతాయి. ఇందులో అతి ముఖ్యమైన మినరల్ జింక్. జింక్ అనేది శరీరానికి చాలా అవసరం. జింక్ లోపంతో చాలా సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 3, 2023, 12:28 PM IST
Zinc Deficiency: జింక్ లోపముంటే అంత ప్రమాదమా, జింక్ లోపంతో కన్పించే లక్షణాలేంటి

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు న్యూట్రియంట్లు చాలా అవసరమౌతాయి. న్యూట్రియంట్ల లోపముంటే..ఆరోగ్యానికి పలు విధాలుగా హాని కలుగుతుంది. ఇందులో ప్రధానమైంది జింక్. జింక్ కారణంగా శరీరానికి చాలా లాభాలు కలుగుతాయి. జింక్ లోపంతో ఏర్పడే సమస్యలేంటో తెలుసుకుందాం. అధిక రక్తపోటు నియంత్రణ, ఇమ్యూనిటీ పటిష్టం చేయడం, గాయాలు మాన్పడం వంటివాటిలో జింక్ అత్యంత కీలకంగా ఉపయోగపడుతుంది. 

జింక్ పుష్కలంగా ఉండే పదార్ధాలు

గుడ్లు

గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివే కాకుండా సూపర్ ఫుడ్స్‌గా పిలుస్తారు. గుడ్లను సాధారణంగా బ్రేక్‌ఫాస్ట్ రూపంలో చాలామంది తీసుకుంటారు. లేదా జిమ్‌కు వెళ్లేవారు అధికంగా తీసుకుంటారు. గుడ్లలో ఉండే పసుపు భాగం చాలామంది వదిలేస్తుంటారు. కానీ ఆరోగ్యానికి అదే మంచిది. ఎందుకంటే గుడ్లలోని పసుపు భాగంలో జింక్ పుష్కలంగా ఉంటుంది. దాంతోపాటు విటమిన్ బి12, థయామిన్, విటమిన్ బీ6, ఫోలేట్, పైంధోనిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ కూడా ఉన్నాయి. 

వెల్లుల్లి

వెల్లుల్లి ప్రతి భారతీయుడి ఇంట్లో తప్పకుండా ఉంటుంది. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇందులో జింక్ ఎక్కువ మోతాదులో ఉండటమే కాకుండా విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, అయోడిన్, ఐరన్, పొటాషియం ఉన్నాయి. వెల్లుల్లి వేడి చేసే స్వభావం కలిగి ఉన్నందున వేసవిలో పరిమితంగా తీసుకోవడం మంచిది. 

పుచ్చకాయ విత్తనాలు

చాలామంది పుచ్చకాయలు అత్యంత ఇష్టంగా తింటారు. కానీ పుచ్చకాయ విత్తనాలు కూడా చాలా మంచివి. పుచ్చకాయ విత్తనాల ప్రయోజనాల గురించి తెలిస్తే ఇంకెప్పుడూ వదిలిపెట్టరు. పుచ్చకాయ సీడ్స్‌లో జింక్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల ఇమ్యూనిటీ పటిష్టమౌతుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

జింక్ లోపంతో కన్పించే లక్షణాలు

బరువు తగ్గడం, గాయాలు త్వరగా మానకపోవడం, తరచూ డయేరియా సమస్య ఉత్పన్నం కావడం, ఆకలి తగ్గడం, మానసిక ఆరోగ్యంపై ప్రభావం, బలహీనత, హెయిర్ ఫాల్, రుచి-వాసన తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

Also read: Corn Health Benefits: జొన్నరొట్టె ఒక్కటి తింటే చాలు, బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలకు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News