Weight Loss Tips: ఈ టీతో మధుమేహం, బరువు తగ్గడం సమస్యలకు 14 రోజుల్లో చెక్‌..

Yellow Tea For Weight Loss Heart Attack: చాలా మంది వివిధ కారణాల వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తేయాకు టీలతో చేసిన ఎల్లో టీని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2022, 01:40 PM IST
  • పచ్చి తేయాకుల టీ ఖాళీ కడుపుతో తాగితే
  • గుండె సమస్యలు, మధుమేహం, బరువు తగ్గడం
  • వంటి సమస్యలు కేవలం 14 రోజుల్లో తగ్గుతాయి.
Weight Loss Tips: ఈ టీతో మధుమేహం, బరువు తగ్గడం సమస్యలకు 14 రోజుల్లో చెక్‌..

Yellow Tea For Weight Loss Heart Attack: చాలా మంది ఉదయం పూట టీలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇవి శరీరానికి అనారోగ్య సమస్యలకు తీసుకురావొచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ టీలకు బదులుగా శరీరానికి పోషకాలను అందించే పసుపుతో తయారు చేసిన టీలను తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  పచ్చి తేయాకుతో తయారు చేసిన టీలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ఆకులతో తయారు చేసిన పసుపు టీ తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గుండె సమస్యలు తగ్గుతాయి:
ఎల్లో టీలో ఉండే పోషకాలు గుండెకు చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే పాలీఫెనాల్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ టీని క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
పచ్చి తేయాకుల టీ శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది. ఈ టీ క్రమం తప్పకుండా తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉండడమేకాకుండా సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా సులభంగా ఊబకాయాన్ని తగ్గిస్తుంది. కాబట్టి శరీర బరువు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ టీని ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
ఈ టీలో క్యాన్సర్ నిరోధక గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో పోషక విలువలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. టీలో ఉండే గుణాలు పాలీఫెనాల్స్ క్యాన్సర్ పెరగకుండా నిరోధిస్తాయి. కాబట్టి ఈ టీని క్రమం తప్పకుండా తీసుకుంటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంటుంది:
జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను తొలగించడానికి ఎల్లో టీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ టీ తాగడం వల్ల అల్సర్, డయేరియా, గ్యాస్ సమస్యలు దూరమవుతాయి. పసుపు టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణక్రియను ఆరోగ్యవంతంగా చేస్తాయి.

మధుమేహాన్ని నియంత్రిస్తాయి:
పసుపు టీలో ఉండే పాలీఫెనాల్స్ చక్కెర స్థాయిని నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలను తగ్గిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ టీని తీసుకోవాల్సి ఉంటుంది.  

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: India Vs Bangladesh Preview: లైట్ తీసుకుంటే షాక్ తప్పదు.. బంగ్లాకు చుక్కలు చూపియాల్సిందే..! 

Also Read: Betel leaves Benefits: ఆ ఆకులతో అల్సర్, మధుమేహం, మలబద్ధకం సమస్యకు చెక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

 

Trending News