Winter Precautions: చలికాలం వస్తోంది జాగ్రత్త, గొంతు సమస్యలు, ఎలర్జీకి సులభమైన చిట్కాలు ఇవే

Throat Allergies: చలికాలం సమీపిస్తోంది. చలికాలం అనగానే..గొంతు సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. సులభమైన చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 24, 2022, 12:01 AM IST
Winter Precautions: చలికాలం వస్తోంది జాగ్రత్త, గొంతు సమస్యలు, ఎలర్జీకి సులభమైన చిట్కాలు ఇవే

సీజన్ మారిందంటే చాలు వివిద రకాల ఇన్‌ఫెక్షన్లు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా చలికాలంలో కొన్ని సమస్యలు కామన్‌గా కన్పిస్తుంటాయి. మరి ఈ సమస్యల్నించి ఎలా గట్టెక్కడం..పరిష్కారం లేదా..

చలికాలంలో సహజంగా శరీరంలో వివిధ రకాల మార్పులు జరుగుతుంటాయి. ఉష్ణోగ్రతలో తేడా కారణంగా ఈ మార్పులు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు సమస్యలకు తోడు గొంతు సంబంధిత ఎలర్జీలు వస్తుంటాయి. గొంతులో గరగర, ఎలర్జీలు సమస్యాత్మకంగా మారుతుంటాయి. ఎలర్జీతో బాధపడేవారు కొన్ని రకాల ఆహారపదార్ధాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితముంటుంది. గొంతునొప్పి గానీ, ఎలర్జీ వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిదంటున్నారు.

ప్రతి వంటింట్లో తప్పకుండా ఉండే అల్లంతో గొంతునొప్పికి చెక్ పెట్టవచ్చు. దీనికోసం అల్లంను ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. వంటల్లో వాడటం లేదా అల్లం టీ తాగడం చేయవచ్చు. సాయంత్రం వేళల్లో అల్లం టీ తాగడం వల్ల గొంతునొప్పి నుంచి విముక్తి పొందవచ్చు. కొద్దిగా అల్లాన్ని టీ లేదా తేనెలో కలుపుకుని తీసుకుంటే మెరుగైన ఫలితముంటుంది. ఎందుకంటే తేనె అనేది చాలా రకాల ఎలర్జీల్ని నియంత్రిస్తుంది. 

ఇక గ్రీన్ టీ కూడా ఎలర్జీని దూరం చేసేందుకు దోహదపడుతుంది. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు, యాంటీ ఎలర్జిటిక్ ఏజెంట్లు అధికంగా ఉన్నాయి. ఎలర్జీని నియంత్రించేందుకు సహకరిస్తుంది.

ఇక విటమిన్ సి నిండిన పండ్లను తినడం ద్వారా గొంతులో ఏర్పడే గరగరను తగ్గించుకోవచ్చు. పండ్లలో ఉండే యాంటీ హిస్టమిన్‌తో ఇది కంట్రోల్ అవుతుంది. అందుకే నారింజ, బొప్పాయి, నిమ్మ, కివి వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవల్సి ఉంటుంది. లేదా యాంటీ హిస్టమిన్ ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. యాపిల్ సైడర్ వెనిగర్‌లో కేవలం ఎలర్జీని తగ్గించే గుణాలే కాకుండా...ఆరోగ్య సమస్యల్నించి ఉపశమనం కల్గించే గుణాలుంటాయి. ఎలర్జీ వల్ల కలిగే దురదను యాపిల్ సైడర్ వెనిగర్ నియంత్రిస్తుంది. 

ఇవి కాకుండా మరో సులభమైన పద్ధతి కూడా ఉంది. గోరువెచ్చని నీళ్లతో నోరు పుక్కిలించడం. గోరు వెచ్చనినీళ్లలో కొద్దిగా ఉప్పు కలిపి..గొంతులో వేసుకుని పుక్కిలిస్తే సత్వర ఉపశమనం లభిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా లభించే డ్రై ఫ్రూట్స్ చేపలు, గుడ్లు, ఆకుకూరలతో కూడా ఈ సమస్య తగ్గుతుంది. 

Also read: Pea Benefits: మటర్‌తో కలిగే ప్రయోజనాలు తెలిస్తే..ఇక వదిలిపెట్టరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News