Uric Acid: యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఏం చేయాలి? ఏయే పదార్థాలు తినాలి? ఏవి తినకూడదు?

Reduce Uric Acid Naturally: శరీరంలో యూరికి యాసిడ్ పెరిగినప్పుడు అనేక సమస్యలు వస్తువు ఉంటాయి కొంతమందిలో కీళ్ల నొప్పులు వస్తే, మరికొంతమందిలో మోకాళ్ళ నొప్పులు, వాపులు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు ఏం సూచిస్తున్నారో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2024, 11:35 PM IST
Uric Acid: యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఏం చేయాలి?  ఏయే పదార్థాలు తినాలి? ఏవి తినకూడదు?

Reduce Uric Acid Naturally:  శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే బాడీలో ఉండే ప్రతి పార్ట్ సక్రమంగా పని చేయాల్సి ఉంటుంది. శరీరంలో ఏ అవయవం సక్రమంగా పనిచేయకపోయినా బాహ్య చర్మంపై అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలామందిలో కీళ్ల నొప్పులతో పాటు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే శరీరంలోని ఎక్కువ మోతాదులు యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం కారణంగా ఇలాంటి సమస్యలు వస్తాయి. ప్యూరిన్‌లను విచ్ఛిన్నం చేసినప్పుడు ఇది ఉత్పత్తి అవుతుంది. చాలామందిలో ఇది పెరగడం కారణంగా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి కొంతమందిలో శరీరంలోని వ్యర్ధపదార్థాలు పేరుకుపోని దీపికాలిక వ్యాధులు కూడా వస్తాయి కాబట్టి యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు తప్పకుండా ప్రతి సీజన్లో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

యూరికి యాసిడ్‌ వల్ల వచ్చే లక్షణాలు:

చాలామందిలో యూరిక్ యాసిడ్ అనేది వయస్సు పెరగడం కారణంగా వచ్చే సమస్య ఇది కేవలం వృద్ధులలో వస్తూ ఉంటుంది అయితే ఆధునిక జీవన శైలి కారణంగా చిన్న వయసులో కూడా చాలామందికి వస్తోంది. ఈ సమస్యతో బాధపడే వారిలో ముందుగా మూత్ర విసర్జనలో అనేక ఇబ్బందులు వస్తాయి. దీంతోపాటు ఎముకలలో నొప్పి, వాపులు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఇవే కాకుండా శరీరంపై అనేక మార్పులు వస్తాయి.

ఈ సమస్యతో బాధపడే వారు పెరుగు తినొచ్చా?

ఈ యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు చాలామంది ఎక్కువగా ఆహారంలో పెరుగును తీసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఎక్కువ కొలెస్ట్రాల్ పరిమాణాలు కలిగిన పెరుగు, పాల ఉత్పత్తులను తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఎక్కువ కొవ్వు ఉన్న పెరుగును తినడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు కీళ్ల నొప్పులు వాపులు పెరగవచ్చు. కాబట్టి ఎక్కువ కొవ్వు ఉన్న పాలు, పెరుగును తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

కొంతమందిలో యూరికి యాసిడ్ సమస్యతో బాధపడే వారిలో మూత్రపిండాలు కూడా దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని రక్షించుకునేందుకు తప్పకుండా ఆహార పదార్థాల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కావాల్సి వస్తే.. వీరు ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కొవ్వు లేని పాల ఉత్పత్తులను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆల్కహాల్ తీసుకునేవారు మానుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

గోరువెచ్చని నీటిని తాగితే ఏం జరుగుతుందో తెలుసా? 

యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులోనే నిమ్మరసం కలుపుకొని తీసుకుంటే ఎవరికీ ఆసిడ్ కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే ఆహారంలో తప్పకుండా గుడ్లు ఉండేటట్లు చూసుకోవడం ఎంతో మంచిది.. గుడ్లను తినడం వల్ల శరీరంలోని యాసిడ్స్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News