Saunf Side Effects: మీకు ఆ సమస్య ఉందా..అయితే సోంపు తినవద్దు..లేకపోతే కలిగే అనర్ధాలివే

Saunf Side Effects: సోంపు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పెద్దలు చెప్పే మాటే కాదు వైద్యులు కూడా చెబుతుంటారు. భోజనం తరువాతో..లేదా అప్పుడప్పుడో తీసుకుంటుంటారు. అయితే కొన్ని సమస్యలున్నవారు సోంపు తీసుకుంటే అనర్ధాలే ఉంటాయిట. అదేంటో పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 29, 2022, 04:04 PM IST
 Saunf Side Effects: మీకు ఆ సమస్య ఉందా..అయితే సోంపు తినవద్దు..లేకపోతే కలిగే అనర్ధాలివే

Saunf Side Effects: సోంపు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పెద్దలు చెప్పే మాటే కాదు వైద్యులు కూడా చెబుతుంటారు. భోజనం తరువాతో..లేదా అప్పుడప్పుడో తీసుకుంటుంటారు. అయితే కొన్ని సమస్యలున్నవారు సోంపు తీసుకుంటే అనర్ధాలే ఉంటాయిట. అదేంటో పరిశీలిద్దాం..

సాధారణంగా సోంపు అనేది ఆరోగ్యానికి మంచిదే. అందుకే ఇంట్లో పెద్దవాళ్లు కచ్చితంగా భోజనం తరువాతో లేదా ఇతర సమయాల్లోనే సోంపు కచ్చితంగా తింటుంటారు. అయితే ఇదే సోంపు విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. కచ్చితంగా వాటిని పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే సోంపు అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. అదే సమయంలో కొన్ని రకాల సమస్యలున్నవారు సోంపు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదంటున్నారు వైద్య నిపుణులు. సోంపు అదేపనిగా ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపు నొప్పి (Stomache Pain) కలుగుతుంది. 

ఎలర్జీ ఉన్నవాళ్లు సోంపు (Saunf ) మితంగా తీసుకోవాలి. సోంపు ఎక్కువ మోతాదులో తీసుకుంటే స్కిన్ ప్రోబ్లమ్స్ ఎదురవుతాయి. సోంపుతో చర్మం చాలా సెన్సిటివ్ అయిపోతుందనేది నిపుణులు చెబుతున్న మాట. ఒకవేళ మీకు తరచూ తుమ్ముల సమస్య ఉంటే..సోంపు తినడం మానేయండి. లేకపోతే మీ మరింతగా పెరిగిపోయే అవకాశాలున్నాయి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మహిళలు కూడా సోంపు తినడం మంచిది కాదు. మీ పిల్లల ఆరోగ్యంపై దాని ప్రభావం చూపవచ్చు. సోంపు ఎక్కువ మోతాదులో తీసుకుంటే తల్లీ పిల్లలిద్దరికీ నష్టం కలుగుతుంది. సోంపు ఎక్కువ మోతాదులో తింటే..ఎలర్జీ రావచ్చు. ఒకవేళ మీరు రెగ్యులర్‌గా ఏదైనా మందులు తీసుకునే అలవాటుంటే..దాంతోపాటు సోంపు తీసుకోవద్దు. సోంపు తినాల్సి వస్తే (Saunf Side Effects)..ఇతర మందులు తీసుకునేటప్పుడు తీసుకోకూడదు. మద్యాహ్నం వేళల్లో భోజనం చేసిన తరువాత కొద్దిగా తీసుకుంటే చాలు. మిగిలిన సమయాల్లో తీసుకోవడం మానేస్తేనే మంచిది. 

Also read: Tulsi Seeds: కేన్సర్ కణాల్ని సైతం నియంత్రించగలిగే ఆ విత్తనాలేంటో తెలుసాసమస్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News