Weight Loss Tips in 7 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఆదే క్రమంలో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం బారిన పడుతున్నారు. అయితే ఈ నమస్య నుంచి ఉపశమనం పొందడానికి రోజూ ఆహార నియమాలతో పాటు, వ్యాయామం చేయడం చాలా అవసరం. అయితే ఇదే క్రమంలో ఆరోగ్యమైన ఫుడ్ కూడా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సులభంగా బరువు పెరుగుతారు. ప్రస్తుతం చాలా మంది డైట్‌ను అనుసరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో అనారోగ్యమైన ఆహారం తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి చాలా నష్టాలు జరుగుతున్నాయి.
ఉదయన్నే ఖాళీ కడుపుతో నీరు తాగాలి:
ప్రతి రోజూ నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో నీరు తాగాలి. అంతేకాకుండా ఈ నీటితో పాటు రాత్రి పూట నానబెట్టిన మెంతుల నీరును తీసుకుంటే శరీరానికి మంచి లాభాలు చేకూరుతాయి. అంతేకాకుండా బరువు కూడా తగ్గుతారు.
ఖాళీ కడుపుతో బాదం:
ఉదయం పూట డిటాక్స్ వాటర్ తాగిన తర్వాత..అరగంట ఆగి నానబెట్టిన బాదంపప్పులను తినాలి. ఇలా చేస్తే శరీరం ఆరోగ్యంగా మారుతుంది.
టిఫిన్:
బరువు తగ్గాలనుకునే వారు అల్పాహారంగా 2 బ్రౌన్ బ్రెడ్‌లతో చేసిన శాండ్‌విచ్ తీసుకోవచ్చు. అంతేకాకుండా వీటికి బదులుగా రొట్టెలను కూడా తీసుకోవచ్చు. ఏదైనా సీజనల్ పండ్లు లేదా కూరగాయలను కూడా తీసుకోవచ్చు.
1 గ్లాసు మజ్జిగ:
మధ్యాహ్న భోజనానికి ముందు 1 గ్లాసు మజ్జిగ తీసుకోవాలి. ఇలా తాగిన వెంటనే 100 గ్రాముల బొప్పాయి, పుచ్చకాయ తినవచ్చు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read:Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ..!
Also read:MP Fire Accident: మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో అగ్నికీలలు..పలువురు సజీవ దహనం..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook