Triphala on empty stomach: త్రిఫల నీటిని తరతరాలుగా మన ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు ఇందులో ఆయుర్వేద పరంగా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. త్రిఫల పాలి హెర్బల్ మెడిసిన్ అని అంటారు. ఇందులో మెడిసినల్ ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. దీంతో మన జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఓరల్ హెల్త్ సంబంధింత సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. త్రిఫల నీటిని పరగడుపున తీసుకోవడం వల్ల మంచి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు దీంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
ఓరల్ హెల్త్..
ఒక నివేదిక ప్రకారం త్రిఫల నీటిని తీసుకోవడం వల్ల పంటి సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చు. క్లోరైక్సిడైన్ మౌత్ వాష్ లా ఇది కూడా పనిచేస్తుంది. పళ్లపైన ప్లేక్ పేరుకోకుండా పంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది, ఫంగల్ పెరగకుండా నివారిస్తుంది.
షుగర్ కంట్రోల్..
త్రిఫల నీటిని తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒక నివేదిక ప్రకారం త్రిఫల నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది యాంట్ డయాబెటిక్ గా పనిచేస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు కణాలు డామేజ్ కాకుండా కాపాడుతుంది.
ఇన్ఫ్లమేషన్..
త్రిఫలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం తో పాటు పాలిఫైనల్స్, సపోనియిన్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా ఇన్ల్ఫమేషన్ రాకుండా కాపాడుతుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటుంది. డయాబెటిస్ ప్రాణాంతక వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు.
ఇదీ చదవండి: అవిసెగింజలను మీ డైట్లో చేర్చుకుంటే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు మీ దరిదాపుల్లోకి రావు..
మంచి జీర్ణక్రియ..
త్రిఫల తరతరాలుగా మలబద్ధకం సమస్యకు నివారణగా వాడుతున్నారు. ఇది కడుపు సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. అంతేకాదు ఇది సహజ సిద్ధంగా మన కడుపు సంబంధ వ్యాధులను నివారిస్తుంది పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
యాంటీ క్యాన్సర్..
ఒక నివేదిక ప్రకారం త్రిఫలం తీసుకోవడం వల్ల ఇందులో యాంటీ క్యాన్సర్ గుణాలు కణాలను క్యాన్సర్ కణాలను పెరగకుండా నివారిస్తుంది పేగు క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ కి ఇది మంచి రెమిడీ.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
ఇదీ చదవండి: చీయాసీడ్స్, పసుపునీటిని పరగడుపున తాగితే మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter