Tomato Juice benefits: టమాటో జ్యూస్ తాగితే మీకు తెలియకుండానే 5 ఆరోగ్య ప్రయోజనాలు..

Tomato Juice health benefits: టమాటాలు మన వంటింట్లో ఉండే అత్యంత అవసరమైన కూరగాయ. టమాటో జ్యూస్ తాగడం వల్ల మన శరీరానికి ప్రయోజనాలు కలుగుతాయి. తాజా టమాటాలతో తయారు చేసిన జ్యూస్ తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి .

Written by - Renuka Godugu | Last Updated : May 23, 2024, 08:00 AM IST
Tomato Juice benefits: టమాటో జ్యూస్ తాగితే మీకు తెలియకుండానే 5 ఆరోగ్య ప్రయోజనాలు..

Tomato Juice health benefits: టమాటాలు మన వంటింట్లో ఉండే అత్యంత అవసరమైన కూరగాయ. టమాటో జ్యూస్ తాగడం వల్ల మన శరీరానికి ప్రయోజనాలు కలుగుతాయి. తాజా టమాటాలతో తయారు చేసిన జ్యూస్ తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి .రుచి కూడా పుల్లగా ఉంటుంది పండిన టమాటాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.

విటమిన్స్..
టమాటో జ్యూస్ తీసుకోవడం వల్ల మన శరీరానికి ఒకరోజు కావలసిన విటమిన్స్ అందినట్లు అవుతుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఒక గ్లాసు టమాటా జ్యూస్ లో 20% విటమిన్ ఏ మన శరీరాన్ని కావాల్సింది దొరుకుతుంది ఇందులో పొటాషియం కాపర్ ,అలాగే మెగ్నీషియం ఐరన్ కూడా ఉండటం వల్ల మన శరీరానికి ఆరోగ్యకరం.
టమాటాలో మన శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి. ఇందులో మినరల్స్ విటమిన్స్ కూడా ఉంటాయి.

కెరటానాయిడ్స్..
టమాటా లో బయో ఆక్టివ్ ఉంటుంది ఇందులో కెరటనాయిడ్స్ పాలిఫైనల్స్ అనే ఫైటో కెమికల్స్ ఉంటాయి .కెరటానాయిడ్స్ విటమిన్ ఏ రూపంలోకి మారుతుంది. ఇది మన ఆరోగ్యకరమైన కంటి చూపుకి ఎంతో అవసరం. అంతే కాదు టమాటా రసం తీసుకోవడం వల్ల క్యాన్సర్ నుంచి దూరంగా ఉండొచ్చని ఒక నివేదిక తెలిపింది. ఇందులోని కెరటనాయిడ్స్ ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి కాకుండా కాపాడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం..
మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఎంతో ముఖ్యం, టమాటా జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ లైకోపీన్ రూపంలో ఉంటుంది ఒక గ్లాసు టమోటా రసంలో 22 మిల్లీగ్రాముల లైకోపీన్ మన శరీరానికి అందుతుంది. ఇది ఫ్రీరాటికల్ డామేజ్ నుంచి వాపు నుంచి కాపాడుతుంది.

ఇదీ చదవండి: ఈ 10 పచ్చ కూరగాయల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. ప్రతిరోజు తింటారు

గుండె సమస్యలు..
అంతేకాదు టమాటా రసాన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాంగా ఉంటుంది. ఇందులోని లైకోపీన్, బీటా కెరటిన్ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కొలెస్ట్రాల్స్ తక్కువగా ఉంచుతాయని బ్రిటిష్ న్యూట్రీషియన్ నివేదిక తెలిపింది.దీనివల్ల గుండె ప్రమాదాలు తక్కువ అయ్యాయని మారిషస్ నివేదిక కూడా తెలిపింది. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా సమర్థవంతంగా తగ్గిస్తుంది.

క్యాన్సర్..
టమాటా జ్యూస్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాల నివారిస్తాయి అని సైంటిఫిక్ రీసెర్చ్ తెలిపింది టమాటా తీసుకోవడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ సమస్యలు దూరంగా ఉంటాయని మరో నివేదిక కూడా తెలిపింది.

ఇదీ చదవండి: మీ పిల్లల కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే ఈ 8 ఫాలో అవ్వండి..

టమాటో తో సైడ్ ఎఫెక్ట్స్..
అయితే టమాటా ఎక్కువ శాతం లో తీసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దీన్ని తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
టమోటాలు అధికంగా తీసుకోవడం వల్ల ఇందులో సోడియం కంటెంట్ ఉంటుంది. ఇది మన శరీరంలో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ని పెంచేస్తుంది.
మీరు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలనుకుంటే టమాటాలు ఫైబర్ తక్కువగా ఉంటుంది.
ఒకవేళ మీరు టమాటా జ్యూస్ లో ఇతర క్యాలరీలు ఉండే పండ్లు కూరగాయలను వేసుకుని తీసుకుంటే జాగ్రత్త పడండి ఇది క్యాలరీలో పెంచుతుంది షుగర్ లెవెల్ అని కూడా పెంచేస్తుంది
టమాటా జ్యూస్ తీసుకోకపోవడమే మంచిది ఇది టమోటాలు యాసిడ్ కంటెంట్ ఉంటుంది సమస్యను మరింత పెంచుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News