Remedy For Throat Pain And Infections: కరోనా వైరస్ సమస్య ఇంకా తొలగిపోలేదు. అందులోనూ చలికాలంలో దగ్గు, జలుబు, గొంతునొప్పి లాంటి అనారోగ్య సమస్యల బారిన పడటం సర్వసాధారణం. కరోనా లక్షణాలలో గొంతు నొప్పి(Throat Pain) కూడా ఒకటి. కరోనా టీకాలు ప్రారంభయ్యాయి కనుక మరికొన్ని రోజులు చాలా జాగ్రత్తలు పాటించాలి.
రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం మాత్రం ఆపవద్దు. అయితే గొంతు నొప్పి వస్తే కంగారు పడాల్సిన పనిలేదు. నొప్పి తీవ్రతరం అయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. గొంతు నొప్పి(Throat Pain)కి మీరు ఇంట్లోనే సులభంగా మెడిసిన్ తయారు చేసుకోవచ్చు. నీరు, అల్లం(Ginger), తేనె లాంటి పదార్థాలు ఉంటే చాలు. అల్లం, తేనెను ఆయుర్వేదం(Ayurvedam)లో ఔషధాలలో వినియోగిస్తారు. ఈ పదార్థాలతో గొంతు నొప్పిని మటుమాయం చేసే కషాయాన్ని తయారు చేసుకుని సేవిస్తే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
Also Read: Hair Loss: మీ జుట్టు రాలుతుంటే ఈ చిట్కాలతో సమస్య పరిష్కరించుకోండి
గొంతునొప్పికి కషాయాలు, తయారు చేసుకునే విధానాలు ఇవే..
- కొంచెం అల్లం తీసుకుని బాగా కడగాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లాన్ని ఓ పాత్రలో వేసి బాగా మరిగించాలి. బాగా మరిచిన తర్వాత దీన్ని వడబోయాలి. ఆ ద్రావణంలో ఒకటి లేక 2 స్పూన్లు తేనె(Health Benefits Of Honey) కలిపి తాగాలి. అవసరం అనుకుంటే ఈ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని గొంతుకు బాగా తాకేలా పుక్కిలించడం ద్వారా గొంతుకు చాలా ఉపశమనం కలుగుతుంది.
Also Read: Red Chilli Powder: కారం పొడి ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
- గొంతు నొప్పి సమయంలో మీరు గోరువెచ్చని నీరు మాత్రమే తాగడం ఉత్తమం. గోరువెచ్చని నీటిలో వెనిగర్ వేసి పుక్కిలిస్తే గొంతు నొప్పితో పాటు ఇన్ఫెక్షన్ త్వరగా నయమవుతుంది. లేకపోతే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని కలిపి ఆ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించడం ద్వారా ఫలితం ఉంటుంది.
- ఒక కప్పు నీటిలో కొన్ని తులసి ఆకులు, నాలుగైదు మిరియాలు వేసి ఉడకబెట్టాలి. ఆ వేడి కషాయాన్ని తాగితే గొంతు ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది. రాత్రి(Sleeping Tips) నిద్రపోయే ముందు కషాయం సేవిస్తే గొంతునొప్పి త్వరగా నయమవుతుంది.
Also Read: Phone In Toilet: మొబైల్‌ను టాయిలెట్‌లో వాడుతున్నారా.. అయితే ఇది చదవండి
- మరో కషాయం తయారు చేసుకోవడానికి కొన్ని మిరియాలు లేక పొడి, నెయ్యి, బాదం పప్పులు అవసరం. ఆ మిరియాల పొడిలో కొంచెం నెయ్యి కలిపి సేవిస్తే ప్రయోజనం ఉంటుంది. నల్ల మిరియాల పొడిని నీటిలో వేసి వేడి చేయాలి. ఆపై కొంచెం మిశ్రమాన్ని తాగితే గొంతు నొప్పి, గొంతుకు సంబంధిత ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook