Throat Allergies: సీజన్ మారగానే గొంతు సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. వర్షాకాలంలో, చలికాలంలో చాలా ఇబ్బంది పెడుతుంటుంది. గొంతు ఎలర్జీ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేయాలో చూద్దాం..
వర్షాకాలంలో లేదా చలికాలంలో..శరీరంలో వివిధ రకాల సమస్యలు వెలుగుచూస్తుంటాయి. దగ్గు, జలుబు సమస్యలకు తోడు గొంతు సంబంధిత ఎలర్జీలు వస్తుంటాయి. గొంతులో గరగర, ఎలర్జీలు సమస్యాత్మకంగా మారుతుంటాయి. ఎలర్జీతో బాధపడేవారు కొన్ని రకాల ఆహారపదార్ధాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితముంటుంది. గొంతునొప్పి గానీ, ఎలర్జీ వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ హెల్త్ టిప్స్ పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అల్లంతో ప్రయోజనాలు
అల్లంలో గొంతునొప్పి తగ్గించే లక్షణాలు చాలా ఉంటాయి. ఈ సమస్యలతో బాధపడేవారు రోజూ అల్లంను వంటల్లో వినియోగించడం చాలా మంచిది. లేదా సాయంత్రం వేళల్లో అల్లం టీ తాగడం వల్ల గొంతునొప్పి నుంచి విముక్తి పొందవచ్చు. కొద్దిగా అల్లాన్ని టీ లేదా తేనెలో కలుపుకుని తీసుకుంటే మెరుగైన ఫలితముంటుంది. ఎందుకంటే తేనె అనేది చాలా రకాల ఎలర్జీల్ని నియంత్రిస్తుంది. గ్రీన్ టీ కూడా ఎలర్జీని దూరం చేసేందుకు దోహదపడుతుంది. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు, యాంటీ ఎలర్జిటిక్ ఏజెంట్లు అధికంగా ఉన్నాయి. ఎలర్జీని నియంత్రించేందుకు సహకరిస్తుంది. రోజుకు ఒకట్రెండు కప్పుల గ్రీన్ టీ తీసుకోవడం ఉత్తమం.
విటమిన్ సి ఉపయోగాలు
ఇక విటమిన్ సి నిండిన పండ్లను తినడం ద్వారా గొంతులో ఏర్పడే గరగరను తగ్గించుకోవచ్చు. పండ్లలో ఉండే యాంటీ హిస్టమిన్‌తో ఇది కంట్రోల్ అవుతుంది. అందుకే నారింజ, బొప్పాయి, నిమ్మ, కివి వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవల్సి ఉంటుంది. ఇక యాపిల్ మరో ముఖ్యమైన పండు. యాపిల్ సైడర్ వెనిగర్‌లో కేవలం ఎలర్జీని తగ్గించే గుణాలే కాకుండా...ఆరోగ్య సమస్యల్నించి ఉపశమనం కల్గించే గుణాలుంటాయి. ఎలర్జీ వల్ల కలిగే దురదను యాపిల్ సైడర్ వెనిగర్ నియంత్రిస్తుంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది గోరువెచ్చని నీళ్లు. గోరు వెచ్చనినీళ్లలో కొద్దిగా ఉప్పు కలిపి..గొంతులో వేసుకుని పుక్కిలిస్తే సత్వర ఉపశమనం లభిస్తుంది.
ఒమేగా- 3 పుష్కలంగా లభించే ఆహార పదార్థాలతో కూడా ఎలర్జీ తగ్గుతుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా వాల్‌నట్స్, ఫిష్ ఆయిల్, అవిసె గింజలు, చేపలు, ఆకుకూరలు, గుడ్లు, చిక్కుడు గింజల్లో ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook