Summer Skin Care Tips: వేసవిలో చర్మ సంరక్షణ కోసం చాలా మంది ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తుల(Skin Protection Products)ను ఉపయోగిస్తారు. కానీ వీటికంటే ఇంట్లో తయారు చేసుకున్న చర్మ సంరక్షణ ఉత్పత్తులు మంచి ప్రభావాన్ని చూపుతాయి. ఇంట్లో తయారు చేసుకున్న ఉత్పత్తులు చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. అయితే చర్మ సంరక్షణ కోసం కొన్ని హోమ్ రెమెడీస్‌లు కూడా ఉన్నాయి. ఇవి చర్మాన్ని వివిధ సమస్యల నుంచి రక్షించడమే కాకుండా చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి. ఔషధ గుణాలతో నిండిన కలబంద చర్మాన్ని లోపలి నుంచి రిపేర్ చేయడమే కాకుండా వేసవిలో హైడ్రేట్‌గా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. బియ్యం నీరు సహజ పోషక విలువలుంటాయని ఇవి UV కిరణాల ద్వారా వచ్చే హానికరమైన కాంతుల నుంచి రక్షిస్తుందని అంటున్నారు. కలబంద, బియ్యం నీరుతో చేసిన ఇంటి రెమెడీ గురించి తెలుసుకుందాం..
కలబంద, బియ్యం నీళ్ల మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలి:
ఒక గిన్నెలో బియ్యం నీళ్ళు తీసుకుని దానికి ఒక చెంచా లేదా రెండు చెంచాల అలోవెరా జెల్ కలపండి. బాగా కలిపిన తర్వాత కాసేపు అలాగే ఉంచాలి. ఈ పేస్ట్‌ను రాసుకునే ముందు తప్పని సరిగా ముఖాన్ని కడగడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి ఆరనివ్వాలి. కొంచెం నీళ్ళు తీసుకుని తేలికపాటి చేతులతో మసాజ్ చేసి తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ప్రయోజనాలు:
ఈ రెండు పదార్థాలను కలపడం ద్వారా చర్మం రిలాక్స్‌గా అవుతుంది. ఎండాకాలంలో చర్మంపై చెమట పట్టడం వల్ల చిరాకు వస్తుంది. అటువంటి పరిస్థితిలో చర్మాన్ని రిలాక్స్ చేయడానికి రైస్ వాటర్, అలోవెరా జెల్ ఉపయోగించండి. దీనిని అప్లై చేయడం ద్వారా చర్మం శుభ్రంగా, లోపల నుంచి తాజాగా ఉంటుంది.
రైస్ వాటర్ కాకుండా కలబంద జెల్ చర్మానికి చాలా ప్రయోజనాన్ని చేకూర్చుతుంది. వీటిలో ఉండే గుణాలు సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఈ మాస్క్‌ని వారానికి రెండు సార్లు ముఖానికి అప్లై చేయడం ద్వారా స్కిన్ ట్యానింగ్, సన్‌బర్న్ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
Also Read: Ys Jagan Review: తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ఉండాలని ఆదేశించిన వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe