Tea vs Coffee: దేశంలో అత్యధికులు రోజు ప్రారంభం టీ లేదా కాఫీతో ప్రారంభిస్తుంటారు. దశాబ్దాలుగా ఇదొక అలవాటు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇండియాలో టీ తాగేవారి సంఖ్య ఎక్కువగా ఉంటే ఇతర దేశాల్లో కాఫీ అంటే మక్కువ చూపిస్తుంటారు. ఈ రెండింటినీ పోల్చినప్పుడు ఏది మంచిదనే ప్రశ్న వస్తుంటుంది.
టీ లో రెండు రకాలున్నాయి. ఒకటి పాలతో చేసేది రెండవది పాలు లేకుండా బ్లాక్ టీ. టీ ఆకుల్ని క్రష్ చేసి డ్రై చేసి పొడిగా చేస్తారు. అదే గ్రీన్, వైట్ టీ అయితే క్యామెల్లా మొక్క నుంచి ప్రోసెస్ చేస్తారు. అదే హెర్బల్ టీ అయితే విత్తనాలు, వేరు, ఆకులు, ఫ్రూట్స్ వంటివాటితో చేస్తారు. ఇక మరో ప్రాచుర్యం పొందిన పానీయం కాఫీ అయితే విత్తనాల నుంచి తయారవుతుంది. ఒక కప్పు కాఫీలో వేలాదిగా సహజసిద్ధమైన కెమికల్స్ ఉంటాయి. ఈ క్రమంలో టీ కాఫీ రెండింట్లో ఏది ఆరోగ్యపరంగా మంచిదో చూద్దాం
కాఫీ ప్రయోజనాలు
కాఫీ తాగడం వల్ల గుండె పోటు ముప్పు తగ్గవచ్చు. లివర్ సమస్యలు, మెదడు వ్యాధులు, టైప్ 2 డయాబెటిస్ కూడా తగ్గే అవకాశముంది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కాఫీ తాత్కాలికంగా తగ్గించగలుగుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ సమస్యను తగ్గించి బ్రెయిన్ సెల్స్‌ను కాపాడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ఉపశమనం కల్గిస్తుంది. పార్కిన్సన్ వ్యాధి ముప్పును కూడా కాఫీ తగ్గిస్తుంది.
టీ ప్రయోజనాలు
టీ రోజూ తాగడం వల్ల కొలెస్ట్రాల్ ముప్పు తగ్గుతుంది. దాంతో పాటు రక్తపోటు, ఇన్ఫ్లమేషన్, డయాబెటిస్, ఫ్యాట్ మెటబోలిజం తగ్గుతాయి. శరీర ఉష్ణోగ్రత, ఇన్సులిన్ సెన్సిటివిటీని నియంత్రిస్తుంది. టీలో పోలీఫెనాల్స్ పెద్ద సంఖ్యలో ఉంటాయి. ఎమైనో యాసిడ్స్ కూడా భారీగా ఉండటం వల్ల జ్ఞాపకశక్తి క్షీణించడం వంటి సమస్యలు ఉండవు.
టీ-కాఫీల్లో ఏది ఆరోగ్యపరంగా మంచిది
పరిమితంగా తాగితే టీ మంచిదే. రోజుకు ఒక కప్పు టీ ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తాయి. ఫలితంగా చాలా వ్యాధులు దూరమౌతాయి. ఇక కాఫీ మోతాదు మించి తాగడం వల్ల ఇరిటేషన్, విసుగు, ఆందోళన, తలనొప్పి, నెర్వస్నెస్ వంటి సమస్యలకు కారణమౌతుంది.
Also read: Dates Benefits: రోజూ 3 ఖర్జూరం పండ్లు తింటే కలిగే 7 అద్భుతమైన ప్రయోజనాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook