Sweating Symptoms: రాత్రిళ్లు చెమట ఎక్కువగా పడుతుందా..అయితే ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు

Sweating Symptoms: అనునిత్యం మన శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి. ఏదో రకమైన ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కొన్ని సాధారణమే కావచ్చు కానీ..కొన్ని మాత్రం ప్రమాదానికి సంకేతాలుగా భావించాలంటున్నారు వైద్య నిపుణులు. ఆ లక్షణాలేంటో చూద్దాం  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 6, 2022, 04:50 PM IST
Sweating Symptoms: రాత్రిళ్లు చెమట ఎక్కువగా పడుతుందా..అయితే ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు

Sweating Symptoms: అనునిత్యం మన శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి. ఏదో రకమైన ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కొన్ని సాధారణమే కావచ్చు కానీ..కొన్ని మాత్రం ప్రమాదానికి సంకేతాలుగా భావించాలంటున్నారు వైద్య నిపుణులు. ఆ లక్షణాలేంటో చూద్దాం

ఆధునిక ఆహారపు అలవాట్లు, పోటీ ప్రపంచంలో ఎదురవుతున్న ఒత్తిడి, ఆందోళన, ఆధునిక జీవన శైలి కారణంగా వివిధ రకాలు అనాలోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. శరీరంలో నిరంతరం జరిగే మార్పుల కారణంగా కొన్ని లక్షణాలు బయటపడుతుంటాయి. ఇందులో కొన్ని లక్షణాలు సాధారణమే అయినా కొన్ని మాత్రం ప్రమాదకర వ్యాధులకు సంకేతాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే మనకు ఎదురయ్యే అన్ని లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకూడదు. 

ముఖ్యంగా రాత్రిపూట చెమట పట్టడమనేది ప్రమాదకర వ్యాధికి సంకేతమంటున్నారు వైద్యులు. అదే పగటి పూట చెమటలొస్తే ఆరోగ్యానికి మంచిదే. పీరియడ్స్ సమయంలో కూడా మహిళలకు రాత్రి పూట చెమటలు పడుతుంటాయి. అయితే రాత్రి పూట చెమటలు మరో కారణం కూడా ఉంటుంది. ఇడియోపతిక్ హైపర్ హైడ్రోసిస్ కారణంగా అకారణంగా చెమటలు పడుతుంటాయి రాత్రిపూట. 

ఇక క్షయ వ్యాధి ఉన్నవారికి కూడా రాత్రి పూట చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. ఎండో కార్డిటిస్, ఆప్టియోమైలిటిస్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ ఉన్నవారికి కూడా రాత్రి సమయంలో చెమటలు అధికంగా వస్తుంటాయి. అటు హెచ్‌ఐవీ బాధితులకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా లింఫోమా వంటి కొన్ని కేన్సర్ వ్యాదులకు చెమటలు పట్టడం ప్రారంభ లక్షణం. మనం వివిధ సమస్యల కారణంగా తీసుకునే మందుల వల్ల కూడా కొన్నిసార్లు చెమటలు పడుతుంటాయి. ఆస్పిరిన్, ఎసిటమినోపైన్ వంటి జ్వరాన్ని తగ్గించే మాత్రలతో కూడా చెమటలు పడతాయి. 

ఇక అన్నింటికంటే ముఖ్యమైంది రక్తంలో చక్కెర స్థాయి తగ్గినప్పుడు. మధుమేహాన్ని నియంత్రించే మందుల వల్ల కూడా రాత్రిళ్లు చెమటలు పడుతుంటాయి. ఇక కార్సినోయిడ్ సిండ్రోమ్, ఫిరయోక్రోమోసైటోమా, హైపర్ థైరాయిడ్ వంటి హార్మోన్ సమస్యలున్నవారికి రాత్రి సమయంలో పెద్దఎత్తున చెమటలు పడతాయి. అటానమిక్ న్యూరోపతి, పక్షపాతం వంటి వ్యాధులుంటే..రాత్రి పూట చెమటలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చెమటలు పట్టినప్పుడు తేలిగ్గా తీసుకోకుండా వెంటనే వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. 

Also read: Ajwain Water: రోజూ ఈ నీరు తాగితే..ఆ రోగాలన్నీ మటుమాయం, వామునీటితో అద్భుత ప్రయోజనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News