Artificial Sweetener: ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఎంతవరకూ క్షేమం, దుష్పరిణామాలు, ప్రయోజనాలేంటి

Artificial Sweetener: ఇటీవలి కాలంలో అందరికీ డయాబెటిస్ ముప్పు పట్టుకుంది. అందుకే ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలామంది మార్కెట్‌లో వచ్చిన ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉపయోగిస్తుంటారు. అయితే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అంటే ఏమిటి, ఇదెంతవరకూ క్షేమమనేది తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 23, 2023, 01:42 AM IST
Artificial Sweetener: ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఎంతవరకూ క్షేమం, దుష్పరిణామాలు, ప్రయోజనాలేంటి

Artificial Sweetener: షుగర్ అనేది డయాబెటిస్ వ్యాధికి అత్యంత ప్రమాదకరమైంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్థులు సాధ్యమైనంతవరకూ చక్కెరకు దూరంగా ఉంటుంటారు. అదే సమయంలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్‌ను చక్కెరకు బదులు వాడుతుంటారు. రుచి చక్కెరలానే ఉంటుంది. ఇంకాస్త ఎక్కువ తీపి ఉంటుంది. ఆరోగ్యం కోసం అదే పనిగా ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వినియోగం మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపించే ప్రమాదముంది కదా..

అసలు ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అంటే ఏంటి

ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అనేది సింథటిక్ షుగర్. సులభంగా అర్ధమయ్యేట్టు చెప్పాలంటే పంచదారకు ప్రత్యామ్నాయం. చాలామంది పంచదార స్థానంలో వినియోగిస్తుంటారు. దీనిని కెమికల్‌తో తయారు చేస్తారు. ఇందులో కేలరీలుండవు.  కానీ రుచిలో చక్కెరలానే ఉంటుంది. ప్యాక్డ్ ఫుడ్స్‌లో ఎక్కువగా ఇదే ఉపయోగిస్తుంటారు. సగ్గుబియ్యంలా ఉండే ఇవి మీరు తాగే టీ లేదా కాఫీకు తీపిని అందిస్తాయి. కేలరీపరంగా చూస్తే జీరో కేలరీలుంటాయి. అధిక బరువు సమస్యను తొలగిస్తాయి. 

అయితే కృత్రిమంగా తయారైనది ఏదైనా దీర్ఘకాలం ఉపయోగిస్తే దుష్పరిణామాలకు దారితీస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అనేది డిప్రెషన్‌కు కారణం కావచ్చు. పరిమితి మించి వినియోగిస్తే మానసిక సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అధికంగా వినియోగిస్తే కేన్సర్ ముప్పు పరిణించవచ్చు. ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ అధ్యయనం వెలువరించిన వివరాల ప్రకారం..ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ను రోజువారీ జీవితంలో అంటే డైట్ లో భాగంగా చేసుకున్నవారు కేన్సర్ బారినపడ్డారు. 

అధిక రక్తపోటు, గుండెపోటు, కొరోనరీ హార్ట్ డిసీజ్ వంటి వ్యాధుల ముప్పు ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వినియోగించావారిలో ఎక్కువగా ఉంటుంది. గుండెపోటు సంబంధిత సమస్యలు ఎక్కువౌతాయి. సాధారణంగా డయాబెటిస్ రోగులు ఎక్కువగా వీటిని ఉపయోగిస్తుంటారు. కానీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అదికంగా తీసుకుంటే డయాబెటిస్ ముప్పు పెరిగిపోతుంది. ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అనేది శరీరం మెటబోలిజంను దెబ్బతీస్తుంటుంది. 

ఇక ఆర్టిఫిషియల్ స్వీట్నర్‌ను కొంతమంది బరువు తగ్గించేందుకు వాడుతుంటారు కానీ చాలా సందర్బాల్లో ఇది రివర్స్ కాగలదు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వాడితే ాకలి పెరిగిపోతుంటుంది.ప్రేవుల్లోని బ్యాక్టీరియాను ప్రభావితం చేయడం వల్ల మెటబోలిజం తగ్గిపోతుంది. దాంతో బరువు తగ్గాల్సింది పోయి పెరిగిపోతుంటుంది. ఎక్కువకాలం ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వినియోగిస్తే తల తిరగడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు.

Also read; Chronic Fatigue Syndrome: తరచూ అలసటగా ఉంటోందా, అయితే ఈ తీవ్రమైన సమస్య కావచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News