Bath Precautions: స్నానం చేసేటప్పుడు ఆ పొరపాటు చేస్తే...స్కిన్ కేన్సర్ ముప్పు

Bath Precautions: స్నానం చేసేటప్పుడు మీరు చేసే ఆ చిన్న పొరపాట్లు మీ ఆరోగ్యానికి హాని చేకూర్చవచ్చు. ఆరోగ్యం కాకుండా..ప్రాణాంతక వ్యాధులు మప్పు తలెత్తవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 15, 2022, 12:04 AM IST
Bath Precautions: స్నానం చేసేటప్పుడు ఆ పొరపాటు చేస్తే...స్కిన్ కేన్సర్ ముప్పు

Bath Precautions: స్నానం చేసేటప్పుడు మీరు చేసే ఆ చిన్న పొరపాట్లు మీ ఆరోగ్యానికి హాని చేకూర్చవచ్చు. ఆరోగ్యం కాకుండా..ప్రాణాంతక వ్యాధులు మప్పు తలెత్తవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే వివిధ రకాల వ్యాధులకు కారణమౌతుంటాయి. ఒక్కోసారి ప్రాణాంతకమైన కేన్సర్ వంటి వ్యాధులకు దారీతీస్తుంటాయి. వెంటనే మీ అలవాట్లను మార్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

చాలామంది స్నానం చేసే సమయంలో ఒళ్లు గట్టిగా రుద్దుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి బదులు అనారోగ్యం కలుగుతుందంటున్నారు. మీకూ అదే అలవాటుంటే ఇవాళే మానుకోండి. స్నానం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ స్నానం చేసే విధానం సరిగ్గా ఉండాలి. లేకుంటే ఆరోగ్యం కాదు కదా..అనారోగ్యం వెంటాడుతుంది. చాలామంది స్నానం చేసేటప్పుడు శరీరాన్ని శుభ్రపర్చేందుకు వినియోగించే కొన్ని వస్తువుల కారణంగా హాని కలుగుతుంది. ఈ విషయం మనకు కనీసం అవగాహన కూడా ఉండదు. స్నానం చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం..

వైద్యుల సూచనన ప్రకారం మెడభాగం, మడమలు, మోకాళ్లు వంటి కొన్నిభాగాలు కాస్త నల్లగా ఉంటాయి. స్నానం చేసేటప్పుడు చాలామంది ఆ ప్రదేశాల్లో బాగా రుద్దుతుంటారు. దీనివల్ల చర్మానికి హాని కలుగుతుంది. స్క్రబ్బింగ్ కారణంగా చర్మం పైపొర క్రమక్రమంగా దెబ్బతింటుంది. ఫలితంగా వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి.

చర్మ కేన్సర్‌కు దారి తీయవచ్చు

స్క్రబ్బింగ్ చేయడం వల్ల చర్మంపై ఉండే ఎమీలైడ్ అనే ప్రోటీన్ పిగ్నెంట్ తగ్గిపోతుంటుంది. ఫలితంగా శరీరంపై హైపర్ పిగ్మంటేషన్ ప్రారంభమౌతుంది. దీంతో మున్ముందు స్కిన్ కేన్సర్ లేదా ఇతర వ్యాధులు రావచ్చు. అందుకే స్నానం చేసే సమయంలో ఎక్కువగా రుద్దుకోకూడదు.

చర్మం ఎలా శుభ్రపర్చుకోవాలి

ఒకవేళ శరీరంలోని కొన్ని భాగాల్లో నల్లని మచ్చల్ని దూరం చేయాలంటే స్నానం చేసేటప్పుడు రుద్దకుండా ఇతర చిట్కాలు అవలంభించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫలితంగా చర్మానికి ఏవిధమైన నష్టం కలగదు. మీ డైట్‌లో విటమిన్ ఇ, ఎ పుష్కలంగా ఉండే పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా నల్లగా ఉండే భాగాల్ని మాయిశ్చరైజ్డ్ ఉండేట్టు చూసుకోవాలి. 

Also read: Hair Care Tips: చలికాలంలో జుట్టు ఎండిపోతోందా..అది రాస్తే కేవలం 1 రోజులోనే పరిష్కారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News