Leg cramps;
మారుతున్న జీవనశైలి ,ఆహారపు అలవాట్ల కారణంగా 30 ఏళ్లు దాటకముందే పలు రకాల సమస్యలతో నేటి యువత సతమతమవుతోంది. చాలామంది తొడ కండరాల నొప్పులు, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు.. ఇలా ఎప్పుడూ ఏదో ఒక నొప్పితో బాధపడుతూనే ఉంటారు. చాలామందికి పొద్దున పూట అంతా నార్మల్ గా ఉన్న రాత్రి పడుకునే సమయానికి పిక్కలు పట్టేయడం ,తొడలు లాగుతూ ఉండడం చాలా సమస్యగా మారుతుంది. దీంతో రాత్రులు నిద్ర కూడా పోలేక ఇబ్బంది పడతారు.
అయితే ఇలాంటి ఇబ్బంది ఎదురు కావడం వెనక కేవలం వయసు ప్రభావమే కాకుండా పోషక విలువల లోపం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లాంటివి కారణాలు కావచ్చు. ఏది ఏమైనాప్పటికీ ఇలా నిద్రపోయే సమయంలో సడన్ గా పిక్కలు పట్టేసి ,కాళ్లు లాగినట్టు, తిమ్మిర్లుగా అనిపిస్తే ఒక్కసారి నిద్ర మొత్తం ఎగిరిపోతుంది. ఇక ఆ తర్వాత నిద్ర పట్టమన్నా పట్టదు. చిన్ని చిట్కాలతో ఇటువంటి ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు.. మరి అవి ఏమిటో తెలుసుకుందాం పదండి..
చాలాసార్లు ఇలా కండరాలు పట్టేసినట్టు అనిపించినప్పుడు కాలు కదపడం కూడా ఎంతో కష్టమవుతుంది. అలాంటి సమయంలో ఐస్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల కండరాలలో టెన్షన్ తగ్గి రిలాక్స్ గా ఫీల్ అవుతారు. రోజు కాస్త గౌరవించండి నీటిలో ఉప్పు వేసి కాళ్ళను ఒక పది నిముషాలు పాటు అందులో ఉంచడం వల్ల కూడా నొప్పులు తగ్గుతాయి.మీకు రోజు ఇలా నిద్రపోయే సమయంలో కాళ్లు లాగినట్టు ,తిమ్మిర్లుగా అనిపిస్తూ ఉంటే.. పడుకునే ముందు గోరువెచ్చటి నూనెతో కాళ్ళను బాగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బిగుతుగా మారిన కండరాలు ఫ్రీ అవ్వడమే కాకుండా పెయిన్ కూడా క్రమంగా తగ్గుతుంది.
మన శరీరానికి కనీసం రోజుకి మూడు లీటర్ల నీరు తీసుకోవడం ఎంతో ముఖ్యం. చాలా సందర్భాలలో మనం అవసరమైన వాటర్ తాగడం మర్చిపోతూ ఉంటాం. ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండానే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. చాలా సందర్భాలలో డిహైడ్రేషన్ కారణంగా కూడా ఇలా రాత్రిపూట పిక్కలు లాగడం, కండరాల నొప్పి కలగడం వంటి సమస్యలు తలెత్తుతాయట. అలాగే మన శరీరంలో పొటాషియం కంటెంట్ తగ్గినప్పుడు ఇలా పిక్కలు పట్టేయడం జరుగుతుంది. అందుకే ఈ సమస్య తో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా అరటి పండు తినాలి. వీలైనంతవరకు యోగ వాకింగ్ లాంటివి చేస్తూ ఉంటే ఇటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి
గమనిక: పైన ఇవ్వబడిన సమాచారం నిపుణుల నుంచి సేకరించింది. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Leg cramps: మీకు రోజు ఇలా అవుతూ ఉంటే.. తస్మాత్ జాగ్రత్త..