Gas Problems: ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అన్నీ ఇబ్బందులే.. చిన్నారుల్లో సైతం గ్యాస్టిక్ సమస్య పెరిగిపోతోంది. చిన్నారుల్లో గ్యాస్ సమస్యను కొన్ని సులభమైన చిట్కాలతో దూరం చేయవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, చెడు జీవనశైలి కారణంగా పెద్దలతో పాటు చిన్నారుల్లో కూడా గ్యాస్ట్రిక్ సమస్య అధికంగా ఉంటోంది. ఇటీవలి కాలంలో పిల్లల్లో గ్యాస్ సమస్య అధికంగా కన్పిస్తోంది. అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన చిట్కాలతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మరి ఏ విధమైన చిట్కాలతో గ్యాస్ సమస్యను దూరం చేయవచ్చనేది ఇప్పుడు తెలుసుకుందాం.
1. వాము అనేది చిన్నారుల్లో గ్యాస్ సమస్యను దూరం చేసేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ వాము వేసి ఉడికించాలి. నీళ్లు సగానికి తగ్గిన తరువాత..వడకాచి గోరువెచ్చగా చేసి తాగాలి. దీనివల్ల పిల్లల్లో గ్యాస్ సమస్య దూరమౌతుంది. వాము టీ కూడా మంచి ఫలితాలనిస్తుంది.
2. మరో పద్ధతి చిన్నారుల డైట్‌లో కొద్దిగా అంటే పరిమిత మోతాదులో అల్లం చేర్చడం. అల్లం రసంతో కూడా గ్యాస్ సమస్యను దూరం చేయవచ్చు లేదా అల్లం టీ కూడా మంచి ఫలితాలనిస్తుంది. అల్లం వల్ల ఇంకా ఇతర ప్రయోజనాలున్నాయి. అల్లంతో జీర్ణక్రియను మెరుగుపర్చవచ్చు. పరిమిత మోతాదులో అల్లం తీసుకోవడం వల్ల జలుబు, జ్వరం వంటి సమస్యలు కూడా దూరమౌతాయి.
3. ఇక మూడవ పద్ధతి నిమ్మరసం. నిమ్మరసం, బ్లాక్‌సాల్ట్ బాగా ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీళ్లలో నిమ్మరసం, బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకోవాలి. చిన్నారుల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
Also read: Hypothyroid Symptoms: హైపోథైరాయిడ్ లక్షణాలేంటి, ఎలా నియంత్రించవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook