Health benefits of Sesame oil: నువ్వుల నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of Sesame oil and Sesame seeds: ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం, నువ్వుల నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొన్ని వందల సంవత్సరాలుగా ఆయుర్వేద ఔషధాలలో నువ్వులు కీలక పాత్ర పోషిస్తున్నాయంటేనే నువ్వులకు ఉండే ఔషద గుణాలు ఎలాంటివో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2021, 07:15 PM IST
  • చూడ్డానికి చిన్నగా ఉండే నువ్వుల గింజల్లో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉండు
  • ఎన్నో ఆరోగ్య సమస్యలకు సింగిల్ సొల్యూషన్ నువ్వుల నూనె
  • ఆయుద్వేంలోనూ (Ayurvedam) నువ్వుల నూనెకు ప్రత్యేక స్థానం
Health benefits of Sesame oil: నువ్వుల నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of Sesame oil and Sesame seeds: ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం, నువ్వుల నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొన్ని వందల సంవత్సరాలుగా ఆయుర్వేద ఔషధాలలో నువ్వులు కీలక పాత్ర పోషిస్తున్నాయంటేనే నువ్వులకు ఉండే ఔషద గుణాలు ఎలాంటివో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నువ్వులను, నువ్వుల నూనెను వివిధ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు తయారు చేసే ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు. నువ్వులను పౌడర్ రూపంలో, పేస్ట్ లేదా నూనె రూపంలో తీసుకోవచ్చు. 

నువ్వుల నూనెలో ఉండే ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడంట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

Also read : Weight Loss Food for Post Pregnancy: ప్రెగ్నన్సీ తరువాత శరీర బరువు తగ్గించే ఆహారాలు

Sesame oil for healthy skin - చక్కటి చర్మ సౌందర్యం కోసం:
నువ్వుల నూనెతో మసాజ్ చేసినట్టయితే.. చర్మం టిష్యూల లోపలి వరకు చేరుతుంది. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వాతావరణ కాలుష్యం నుంచి, విష తుల్యాల నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. నువ్వుల నూనెతో శరీరానికి విటమిన్ -డి కూడా లభిస్తుంది.

Keeps your body warm - మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది:
నువ్వుల నూనెకు శరీరాన్ని వెచ్చగా ఉంచే గుణం ఉంటుంది. చలికాలంలో నువ్వుల నూనెతో మర్దన చేసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది.

Best solution for digestion - జీర్ణశక్తికి చక్కటి పరిష్కారం:
నువ్వుల్లో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని పెంచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. కీళ్లలో మంట, దంతాల నొప్పిని కూడా నివారిస్తుంది.

Also read : Weight loss tips: అధిక బరువు తగ్గించే అద్భుతమైన Drinks

Joint pains - కీళ్ల నొప్పులకు ఉపశమనం:
కీళ్ల నొప్పులతో బాధపడే వారు నొప్పులు ఉన్న చోట నువ్వుల నూనెతో మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Sleeping solution - నిద్రలేమికి పరిష్కారం:
నిద్రలేమితో (Sleeplessness) బాధపడే వారికి, కండి నిండా నిద్రపోవాలనుకునే వారికి పడుకునే ముందు కొన్ని చుక్కల నువ్వుల నూనెను నుదుటిపై వేసి సున్నితంగా మర్దన చేస్తే చాలు... హాయిగా నిద్రపడుతుంది.

Also read : Loss weight With Dalia: ఎంత ప్రయత్నించిన బరువు తగ్గట్లేదా..?? అయితే ఇది ట్రై చేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News