Stress Relief: ఇది తాగితే జన్మలో మీరు ఒత్తిడికి గురవ్వరు.. నమ్మట్లేదా?

Saffron Water Benefits: ప్రతిరోజు కుంకుమపువ్వు నీటిని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే కొన్ని సమ్మేళనాలు మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా ఒత్తిడిని తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవే కాకుండా ఈ క్రింది వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 23, 2024, 12:25 PM IST
Stress Relief: ఇది తాగితే జన్మలో మీరు ఒత్తిడికి గురవ్వరు.. నమ్మట్లేదా?

Saffron Water Benefits: కుంకుమపువ్వును ఎక్కువగా  స్వీట్ లేదా ఆహార పదార్థాలపై వినియోగిస్తూ ఉంటారు. ఇది ఆహారాల రుచిని పెంచడమే కాకుండా మంచి రంగు అందించేందుకు ఎంతగానో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే దీనిని గత కొన్ని శతాబ్దాల క్రితం ఆయుర్వేదంలో కూడా వినియోగించే వారట. ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉండడమే కాకుండా శరీరానికి కావలసిన కొన్ని పోషకాలు కూడా లభిస్తాయట. అందుకే కుంకుమ పువ్వుకు ఆయుర్వేదంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ పువ్వును కాశ్మీరీ ప్రజలు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. నిజానికి ప్రతిరోజు కుంకుమపువ్వును నీటిలో నానబెట్టుకుని దానిని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయట. ఇందులో ఉండే పోషకాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులనుంచి శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని సంరక్షించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. అయితే కుంకుమపువ్వు నీటిని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం: 
కుంకుమ పువ్వు నీరులో యాంటీఆక్సిడెంట్లకు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు కుంకుమ పువ్వు నీటిని తాగడం వల్ల శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించేందుకు సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ నష్టానికి దారితీసే అస్థిర పరమాణువులు, గుండె జబ్బులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక రాకుండా ఈ నీరు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

జ్ఞాపకశక్తి, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది:
కుంకుమ పువ్వులో ఉండే కొన్ని సమ్మేళనాలు మెదడు కణాల మధ్య పెరిగిన న్యూరోట్రాన్స్మిటర్ సంకర్షణను మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఈ నీటిని తాగడం వల్ల జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా మెదడుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయని ఆయుర్వేదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులో ఉండే గుణాలు మెదడును శక్తివంతంగా చేసేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయట.

మానసిక స్థితి:
కుంకుమ పువ్వు నీటిని ప్రతి రోజు తాగడం వల్ల మానసిక స్థితి కూడా ఎంతగానో మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కొన్ని సమ్మేళనాలు మెదడులో సెరోటోనిన్ అనే హార్మోన్ స్థాయిలను పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా ఆందోళన నిరాశను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. తరచుగా ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ కుంకుమపువ్వు నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడకుండా ఉంటారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

రోగ నిరోధక శక్తి పెంచేందుకు: 
కుంకుమ పువ్వులో ఉండే కొన్ని గుణాలు అంటువ్యాధుల ప్రమాదాన్ని ఎంతగానో తగ్గించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఇన్ఫెక్షన్లను తొలగించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే తెల్ల రక్త కణాల పనితీరును మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడేవారు తప్పకుండా ఈ కుంకుమపువ్వు నీటిని తాగండి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News