Pumpkin Seeds Benefits For Men: గుమ్మడికాయలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. బాడీ కాయే కాకుండా గింజలు కూడా పోషకాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలపుతున్నారు. ఈ గింజల్లో విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. ప్రతి రోజు వీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా మలబద్ధకం, గుండె సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఈ గింజలను తీసుకోవడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నాకు. ఈ గింజలను ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆ లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గుమ్మడికాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
✽ పురుషులు ప్రతి రోజు గుమ్మడికాయ గింజలు తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు వీటిని తీసుకోవడం వల్ల నాణ్యత పెరుగుతుంది. అయితే ఇందులో జింక్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
✽ గుండెను ఆరోగ్యంగా ఉంచేందకు కూడా గుమ్మడి గింజలు ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, జింక్‌లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
✽ గుమ్మడి గింజల్లో పీచు అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి పొద్దున్నే వీటిని ఖాళీ కడుపుతో తింటే..శరీరం ఫైబర్ లభిస్తుంది. దీని వల్ల శరీర బరువుతో పాటు కొలెస్ట్రాల్ పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి.
✽ ప్రతి రోజు గుమ్మడికాయ గింజలను తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణాలు కూడా పెరుగుతాయి. ఇందులో ఐరన్ పరిమాణాలు కూడా అధికంగా లభిస్తాయి. కాబట్టి శరీరంలో ఐరన్ లోపాన్ని తగ్గించేందుకు సహాపడతాయి. ప్రస్తుతం చాలా మంది రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలున్నవారికి కూడా తప్పకుంగా ఈ గింజలను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది.
✽ గుమ్మడి గింజల్లో విటమిన్ ఇ, కెరోటినాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు వీటిని తినడం వల్ల శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించడానికి సహాయపతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను కూడా దూరం చేస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా గుమ్మడి గింజలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook