Weight Loss Tips: గుమ్మడికాయతో కూడా శరీర బరువు, బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చు, నమ్మట్లేదా?

Pumpkin Benefits For Weight Loss: గుమ్మడికాయ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్‌ను కూడా తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2023, 01:45 PM IST
Weight Loss Tips: గుమ్మడికాయతో కూడా శరీర బరువు, బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చు, నమ్మట్లేదా?

Pumpkin Benefits For Weight Loss: ఇప్పుడున్న సిచువేషన్‌లో ఏ వ్యాధి ఎవరిని చుట్టుముడుతుందో ఎవరికీ తెలియదు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ప్రాణానికే ప్రమాదం. అయితే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ఆరోగ్యమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోషకాలు అధిక పరిమాణంలో ఉన్న కూరగాయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అయితే గుమ్మడికాయను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. గుమ్మడికాయలను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గుమ్మడికాయ ప్రయోజనాలు:
1. కళ్లకు ప్రయోజనకరంగా ఉంటుంది:

గుమ్మడికాయ తినడం వల్ల కళ్లకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి. దీనిని ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి బీటా-కెరోటిన్ లభించి కంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా వీటిని ప్రతి రోజూ తినడం వల్ల సీజనల్‌ వ్యాధులను దూరం చేస్తుంది.

2. ఊబకాయాన్ని తగ్గించడానికి:
బరువు తగ్గాలనుకునే వారు గుమ్మడికాయ ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఒబెసిటీ గుణాలు శరీర బరువును తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు డైట్‌లో తప్పకుండా గుమ్మడికాయను తీసుకోవాల్సి ఉంటుంది.

3. రోగనిరోధక శక్తిని పేరుగుతుంది:
గుమ్మడికాయ శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-ఇ, బీటా-కెరోటిన్, ఫైబర్, రైబోఫ్లావిన్, పొటాషియం లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

4. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తుంది:
బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించేందుకు గుమ్మడికాయ ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

ఇది కూడా చదవండి : Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

ఇది కూడా చదవండి : Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News