Potato Juice: రోజూ క్రమం తప్పకుండా తాగితే నెలల వ్యవధిలో గంభీరమైన వ్యాధులు కూడా మాయం

Potato Juice: ఆరోగ్యం కోసం ఇప్పటి వరకూ వివిధ రకాల ఫ్రూట్ జ్యూస్, వెజిటెబుల్ జ్యూస్ తాగుంటారు కదా. ఇప్పుడు పొటాటో జ్యూస్ ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా అద్భుత ప్రయోజనాలున్నాయి. ఆ ప్రయోజనాలేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 2, 2023, 08:02 PM IST
Potato Juice: రోజూ క్రమం తప్పకుండా తాగితే నెలల వ్యవధిలో గంభీరమైన వ్యాధులు కూడా మాయం

బంగాళదుంపను సాధారణంగా కర్రీస్ రూపంలో చాలా ఎక్కువగా వినియోగిస్తారు. లేదా స్నాక్స్ రూపంలో కూడా ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో బంగాళదుంప జ్యూస్ గురించి చాలామందికి తెలియదు. ఈ జ్యూస్‌తో కలిగే ప్రయోజనాలు వింటే ఇక వదిలిపెట్టరు కూడా. పోషక పదార్ధాలు పుష్కలంగా ఉన్న పొటాటో జ్యూస్‌తో చాలా గంభీరమైన వ్యాధులు కూడా నయమౌతాయి. ఆ వివరాలు మీ కోసం..

కొలెస్ట్రాల్ నియంత్రణ

బంగాళదుంప జ్యూస్ కొలెస్ట్రాల్ తగ్గించేందుకు కీలకంగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి పోషకాలంటాయి. ఫలితంగా కొలెస్ట్రాల్ నియంత్రణలో దోహదపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు పొటాటో జ్యూస్ రోజూ తాగాల్సి ఉంటుంది. 

మైగ్రెయిన్ అరికట్టేందుకు

పొటాటో జ్యూస్ మానసిక ఆరోగ్యానికి చాలా లాభదాయకం. ఇది ఒత్తిడి, అలసట, డిప్రెషన్‌ను దూరం చేస్తుంది.  ఈ జ్యూస్ మైగ్రెయిన్ పెయిన్ అరికట్టేందుకు దోహదపడుతుంది. పొటాటో జ్యూస్ తాగడమే కాకుండా తలకు రాసుకున్నా మంచి ఫలితాలుంటాయి. నొప్పి తగ్గుతుంది. 

అల్సర్ ముప్పు దూరం

పొటాటోలో ఉన్న న్యూట్రియంట్లు అల్సర్‌ను దూరం చేయడంలో కీలకంగా ఉపయోగపడతాయి. బంగాళదుంప జ్యూస్ తాగడం వల్ల కడుపులో బ్యాక్టీరియా అంతమౌతుంది. అల్సర్ ఏర్పడకుండా నియంత్రిస్తుంది. బంగాళదుంప జ్యూస్ అల్సర్ ముప్పుును దూరం చేస్తుంది. 

ఇమ్యూనిటీ వృద్ధి

పొటాటో జ్యూస్ తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. వ్యాధుల్నించి పోరాడే సామర్ధ్యం కలుగుతుంది. పొటాటోలో ఉన్న విటమిన్ సి అంటువ్యాధుల్నించి రక్షిస్తుంది. పొటాటో జ్యూస్ తాగితే..జలుబు వంటి సమస్యలు దూరమౌతాయి.

హెల్తీ లివర్

పొటాటో జ్యూస్ లివర్‌ను డీటాక్స్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఉదయం పరగడుపున పొటాటో జ్యూస్ తాగడం వల్ల లివర్ శుభ్రమౌతుంది. హెపటైటిస్  వంటి వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది. పొటాటో జ్యూస్ మీ లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Also read: Winter Smog care: పొగమంచు నుంచి మీ లంగ్స్‌ను కాపాడుకునే అద్భుతమైన పద్ధతులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News