Weight Loss Tips: చలి కాలంలో ప్రతి రోజూ ఈ జ్యూస్‌ తాగితే.. కేవలం 7 రోజుల్లో శరీర బరువుకు చెక్‌..

Pineapple For Weight Loss: చలి కాలంలో అనారోగ్య సమస్యలు రావడం సర్వసాధరణం. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ కింద పేర్కొన్న జ్యూస్‌ను తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2022, 04:47 PM IST
Weight Loss Tips: చలి కాలంలో ప్రతి రోజూ ఈ జ్యూస్‌ తాగితే.. కేవలం 7 రోజుల్లో శరీర బరువుకు చెక్‌..

Pineapple For Weight Loss: పైనాపిల్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. పైనాపిల్‌లో విటమిన్లు, మినరల్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తుంది. చలికాలంలో పైనాపిల్ జ్యూస్ తాగడం చాలా ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందలో విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ కె, విటమిన్ బి1 (థయామిన్), కాపర్, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్ లభిస్తాయి. అయితే దీనితో చేసిన జ్యూస్‌ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

రోగనిరోధక శక్తిని పెంచుతాయి:
పైనాపిల్‌లో ఉండే గుణాలు జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల నుంచి శరీరాన్ని దూరంగా ఉంచుతాయి. ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల అటువంటి వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే బ్రోమెలైన్ ఇన్ఫెక్షన్‌తో పోరాడేందుకు సహాయపడుతుంది.    

బరువు తగ్గుతారు:
పైనాపిల్ జ్యూస్ తాగితే సులభంగా శరీర బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పైనాపిల్ జ్యూస్‌లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవి బరువును తగ్గించడానికి సహాయపడతాయి. ఈ జ్యూస్‌ను బ్రేక్‌ఫాస్ట్‌లో తాగితే సులభంగా బరువు తగ్గుతారని నిపుణులు తెలుపుతున్నారు.

చర్మ సమస్యలకు చెక్‌:
చాలా మంది వాతావరణంలో కలుష్యం కారణంగా చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పైనాపిల్ కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు చర్మానికి చాలా రకాలుగా మేలు చేసి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ వంటి పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మార్చుతాయి.

జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం:
స్ట్రీట్ ఫుడ్స్ తినడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. అయితే దీని కారణంగా చాలా మంది జీర్ణక్రియ సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పైనాపిల్ జ్యూస్ తాగాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే మూలకాలు అజీర్ణం, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తాయి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

 

Also Read: Allu Arjun Good Heart: మా బన్నీ బంగారం.. ఆ అమ్మాయికే కాదు.. డ్రైవర్ కు కూడా మరచిపోలేని సహాయం!

Also Read: Samantha Stardom: చైతూ, నాగార్జునలను చిత్తు చేసిన సమంత... తొక్కుకుంటూ పోవాలంటున్న ఫాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News